సేమ్‌ టు సేమ్‌ | - | Sakshi
Sakshi News home page

సేమ్‌ టు సేమ్‌

Feb 22 2026 7:09 AM | Updated on Feb 22 2026 7:09 AM

సేమ్‌

సేమ్‌ టు సేమ్‌

కవలల పెళ్లి సందడి

నేడు కవలల దినోత్సవం

భిక్కనూరు: సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ఆ ఏడుగురు ఎవరు.. ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. కాని అందులో ఒకే రూపం కలిగిని ఇద్దరు పిల్లలు ఒకే ఇంట్లో ఉంటే అబ్బో ఇది గొప్ప అనుభూతే. అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కవలల ఫొటోలు

మాచారెడ్డి: కవల పిల్లలైన ఇద్దరు అన్నదమ్ములకు కవలలైన ఇద్దరు అక్క చెల్లెలు ఒకటి కాబోతున్న అరుదైన ఘటన ఇది. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌(ఎం) గ్రామానికి చెందిన దుంపటి భాస్కర్‌– సుజాతల కవల కుమారులైన విజయ్‌ కుమార్‌, వినయ్‌ కుమార్‌లకు తాడ్వాయి మండలం దేమే గ్రామానికి చెందిన కుమ్మరి రాజమణి– సాయన్నల కవల కుమార్తెలు కీర్తన, కీర్తి ఆదివారం ఒకటి కానున్నారు. కామారెడ్డిలోని బృందావన్‌ గార్డెన్‌లో కవల వధూవరులకు వివాహం జరిపించనున్నారు. ఇద్దరు కవల జంటలు ఒకటి కాబోతున్న సందర్భంగా కవలలు దొరకడం చాలా అరుదు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సేమ్‌ టు సేమ్‌ 1
1/3

సేమ్‌ టు సేమ్‌

సేమ్‌ టు సేమ్‌ 2
2/3

సేమ్‌ టు సేమ్‌

సేమ్‌ టు సేమ్‌ 3
3/3

సేమ్‌ టు సేమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement