మంత్రిని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రానికి శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కామారెడ్డి నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఉమారాణిని మంత్రి అభినందించారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు. అలాగే కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రలను చైర్‌పర్సన్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, నాయకులు ఇప్ప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


