డీఎంహెచ్‌వోగా దుర్గారామ్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

డీఎంహెచ్‌వోగా దుర్గారామ్‌కుమార్‌

Feb 21 2026 7:01 AM | Updated on Feb 21 2026 7:01 AM

డీఎంహ

డీఎంహెచ్‌వోగా దుర్గారామ్‌కుమార్‌

డీఎంహెచ్‌వోగా దుర్గారామ్‌కుమార్‌ భరోసా సెంటర్‌ ఇన్‌చార్జిగా ఎస్సై స్రవంతి హైవే పనుల్లో 268 చెట్ల తొలగింపు

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిగా కుకట్‌పల్లిలో సివిల్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎస్‌. దుర్గా రామ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్‌ బి. రవీందర్‌ నాయక్‌ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్న డాక్టర్‌ విద్యా రన్వాల్కర్‌ను బాధ్యతల నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం నూతన డీఎంహెచ్‌వో దుర్గారామ్‌కుమార్‌ బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిసింది.

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్‌ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై జ్యోతి అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. దీంతో పట్టణ పీఎస్‌లో మహిళా ఎస్సైగా పనిచేస్తున్న స్రవంతిని భరోసా సెంటర్‌ ఇన్‌చార్జిగా నియమించినట్లు ఎస్పీ రాజేష్‌ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులకు న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, అవసరమైన సహాయాన్ని సమగ్రంగా అందించడం భరోసా సెంటర్‌ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. భరోసా సెంటర్‌ నిర్వహణలో భాగంగా మహిళలు, పిల్లలు, ఇతర బాధితులకు అందిస్తున్న సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించాలని ఆదేశించారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట ఫారెస్ట్‌రేంజ్‌ పరిధిలోని నాగిరెడ్డిపేట మండలంలోగల అటవీప్రాంతంలో నేషనల్‌ హైవే 765–డి ఏర్పాటు పనుల్లో భాగంగా తొలగించే 268 చెట్లను గుర్తించినట్లు కామారెడ్డి ఎఫ్‌డీవో(ఫారెస్ట్‌ డివిజన్‌ అధికారి) రామక్రిష్ణ పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట ఫారెస్ట్‌రేంజ్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. దీంతోపాటు ఫారెస్ట్‌ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించి విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. మండలంలోని అటవీప్రాంతంలో నేషనల్‌ హైవే ఏర్పాటులో భాగంగా తొలగించనున్న చెట్లను ఆయన పరిశీలించారు. నేషనల్‌ హైవే పనుల్లో భాగంగా తొలగిస్తున్న చెట్ల స్థానంలో నూతనంగా మొక్కలను నాటిస్తామన్నారు. నాగిరెడ్డిపేట ఎఫ్‌ఆర్‌వో వాసుదేవ్‌, డీఎఫ్‌ఆర్‌వో రవికుమార్‌, బీట్‌అధికారులు నవీన్‌, సమ్రీన్‌, సిబ్బంది గోపాల్‌, బాలు తదితరులున్నారు.

డీఎంహెచ్‌వోగా  దుర్గారామ్‌కుమార్‌
1
1/1

డీఎంహెచ్‌వోగా దుర్గారామ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement