రైతులు కాలర్ ఎగరేసుకుని బతకాలి
ఆయిల్‌పామ్‌తో ఆర్థికాభివృద్ధి..
● వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వర్‌రావ్
● పాల్వంచలో ఆయిల్‌పామ్
ప్లాంటేషన్ ప్రారంభం
మాచారెడ్డి: తెలంగాణ రైతులు కాలర్ ఎగరేసుకుని గర్వంగా బతకాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావ్ అన్నారు. పాల్వంచ మండల కేంద్రంలో శుక్రవారం ఆయన ఆయిల్‌పామ్ ప్లాంటేషన్‌ను ప్రారంభించారు. అనంతరం స్థానిక ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సమన్వంతో జిల్లాలో ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుందన్నారు. ఈనేపథ్యంలో బహుళజాతి సంస్థ హిందుస్తాన్ యుని లిమిటెడ్‌కు జిల్లాలో ఆయిల్ పామ్ తోటల అభివృద్ధి బాధ్యతను అప్పగించినట్లు పేర్కొన్నారు. అలాగే జిల్లాలో పామాయిల్ మిల్లును ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఆయిల్‌పామ్ గెలలను కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించారు. రైతులకు రాయితీతో మొక్కలు, ఎరువులు, అంతరపంటలు సాగు పరికరాలు అందిస్తామన్నారు. బిందు సేద్యం పరికరాల కోసం కూడా రైతు వాటా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమని, అయితే నీటి వసతి మాత్రం వరిపంటలకు అందించినట్టు అందించాలన్నారు. రైతులు వరి వేసేబదులు ఆయిల్‌పామ్ సాగు చేయడం ద్వారా ఎలాంటి చీడపీడల ఆశించవని అతివృష్టి, అనావృష్టి ఎదురైనా పంటకు ఎలాంటి నష్టం కలగదని అన్నారు.
వ్యవసాయ సలహాదారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి చెందుతారని వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంత్రి స్వయాన రైతుబిడ్డ కావడం వల్ల రైతుల బాగోగులు చూడడానికే ఆయిల్‌పామ్ సాగును తెరపైకి తెచ్చాడని అన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్య, హర్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్, డీఏవో మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పాల్వంచ సర్పంచ్ కూచని శేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పల్లె రమేశ్‌గౌడ్, రైతులు ఉన్నారు.


