మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం
నిజాంసాగర్/భిక్కనూరు/తాడ్వాయి/బాన్సువాడ/కామారెడ్డి అర్బన్/పిట్లం/సదాశివనగర్/నస్రుల్లాబాద్/మాచారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్/దోమకొండ: మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమని మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. గురువారం మహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో సీఎం కప్ క్రీడలను రాజకీయ నాయకులు, మండల అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమ్మద్ నగర్‌లో సర్పంచులు, అధికారులు వాలీబాల్ ఆడి , క్రీడాకారుల్లో ఉత్సహాన్ని నింపారు.భిక్కనూరు మండలంలో జరుగుతున్న సీఎం కప్ పోటీల్లో ఖోఖో క్రీడల్లో గురువారం జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జట్టు విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిని పాఠశాలలో ఉపాధ్యాయులు గపూర్‌శిక్షక్,పీడీ నరేందర్‌లు అభినందించారు.తాడ్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం తాడ్వాయిలో సీఎం కప్ మండల స్థాయి క్రీడ పోటీలను జ్యోతిప్రజ్వలన, విద్యార్థుల యోగాసానాలతో ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ ప్రారంభించారు.బీర్కూర్‌లో సీఎం కప్ మండల స్థాయి క్రీడలను ఎంపీడీవో శ్రీనిధి ప్రారంభించారు.సీఎం కప్ కామారెడ్డి మండల స్థాయి క్రీడ పోటీలను ఎంపీడీవో హెఫ్సీబా ప్రారంభించారు. గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన పోటీల్లో కబడ్డీ (పురుషులు)లో శాబ్దిపూర్ ప్రథమ, గర్గుల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. వాలీబాల్ బాలురలో గర్గుల్ ప్రథమ, చిన్నమల్లారెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఖోఖో లో గర్గుల్ ప్రథమ, చిన్నమల్లారెడ్డి ద్వితీయ స్థానం పొందాయి.పిట్లం మండలంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి.ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి సీఎంకప్ క్రీడ పోటీలను సర్పంచ్ ఎడ్ల నర్సింలు ప్రారంభించారు. ఖో–ఖోలో బాలికల విభాగంలో ప్రథమ బహుమతి ధర్మారావ్‌పేట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ద్వితీయ బహుమతిని ఉత్తునూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కై వసం చేసుకున్నారు. బాలుర విభాగంలో ప్రథమ బహుమతి ఉత్తునూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ద్వితీయ బహుమతిని సదాశివనగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అందుకున్నారు.నస్రుల్లాబాద్ గిరిజన గురుకుల బాలుర పాఠశాల ప్రాంగణంలో సీఎం కప్ క్రీడా పోటీలను ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్ ప్రారంభించారు.ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామంలో సీఎం కప్ పోటీలు రెండవ రోజు కొనసాగాయి. రూరల్ విభాగంలో ఖోఖోలో మత్తమాల జట్టు ప్రథమ స్థానం సాధించగా, కల్యాణి జట్లు ద్వితీయ బహుమతిని సాధించారు. అర్బన్ బాయ్స్ వాలీబాల్ విభాగంలో సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల జట్టు ప్రథమ బహుమతి పొందగా, ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జట్టు ద్వితీయ బహుమతి సాధించారు.మాచారెడ్డి మండల కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడోత్సవాల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు వీరే. ఖోఖోలో బాలికల విభాగంలో మొదటి స్థానంలో మాచారెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థినులు, ద్వితీయ స్థానంలో లచ్చాపేట ఉన్నత పాఠశాల విద్యార్థినులు, ఖోఖో బాలుర విభాగంలో మాచారెడ్డి ఉన్నత పాఠశాల మొదటి, చుక్కాపూర్ ఉన్నత పాఠశాల రెండో స్థానం సాధించాయి. కబడ్డీ బాలుర విభాగంలో సోమారంపేట ప్రథమ, చుక్కాపూర్ ద్వితీయ, కబడ్డీ బాలికల విభాగంలో లచ్చాపేట ప్రథమ, మాచారెడ్డి ద్వితీయ స్థానాల్లో నిలిచారు.దోమకొండలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజులు ప్రారంభించారు.


