వివాహిత ఆత్మహత్య
బీబీపేట: ఇష్టం లేని పెళ్లి చేయడంతో జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జనగామ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోకిరే అనూష (21)కు బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన రాజశేఖర్‌తో నవంబర్‌లో పెళ్లి జరిగింది. అయితే పెళ్లి ఇష్టం లేకపోవడంతో బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త రాజశేఖర్ ఇంటికి వచ్చి చూడగా అప్పటికే అనూష మృతి చెందింది. మృతురాలి కుటుంబీకులకు సమాచారం అందించడంతో జనగామకు చేరుకున్నారు. మృతురాలి తండ్రి బాలమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
రాజంపేట(భిక్కనూరు): రాజంపేట మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన మాలోవత్ నవీన్ (25) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజు గురువారం తె లిపారు. నవీన్‌కు గ్రామంలోని కొందరితో గొడవలు ఉన్నాయి. ఈ విషయమై న వీన్ మనస్తాపానికి గురై ఇంట్లో గురువారం వేకువజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి శంకర్ ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని గోల్‌బంగ్లా వద్ద శివకుమార్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తుండడంతో పోలీసులు దాడి చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. శివకుమార్ వద్ద నుంచి 15 బీర్లు, 37 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.


