ఇందిరమ్మ ఇంటినిర్మాణం నిలిపివేత
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని జప్తిజాన్కంపల్లిలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని గురువారం ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ నిలిపివేశారు. గ్రాపంచాయతీకి సంబంధించిన స్థలంలో జోడు దుర్గయ్య అనే వ్యక్తి ఇందిరమ్మ ఇంటినిర్మాణం చేపడుతున్నాడని తమకు వచ్చిన ఫిర్యాదుమేరకు గ్రామానికి చేరుకొని ఇంటినిర్మాణాన్ని పరిశీలించినట్లు ఎంపీడీవో తెలిపారు. గ్రామస్తుల్లో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఇంటినిర్మాణంపై నిర్ణయిస్తామని ఆయన వివరించారు. ఆయనవెంట పంచాయతీ కార్యదర్శి శంకర్ ఉన్నారు.
భిక్కనూరు: మెదక్ జిల్లా అక్కన్నపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భార్యాభర్తల అంత్యక్రియలు స్వగ్రామమైన భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో గురువారం జరిగాయి. ప్రమాదంలో మృతి చెందిన భార్యాభర్తలు బాల్‌రాజు–మంజుల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బస్వాపూర్ గ్రామానికి తీసుకువచ్చారు. అంగళ్లు తిరుగుతూ మిర్చీబజ్జీల బండి నడుపుకొంటూ జీవనం సాగించే దంపతుల మృతితో బంధువులు, కుటుంబసభ్యులు బోరున విలిపించారు. దంపతుల మృతితో అనాథలైన కుమార్తెలు, కుమారుడిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని కల్వరాల్ ఉన్నత పాఠశాలకు అదే గ్రామానికి చెందిన జొర్రీగల నర్సయ్య విద్యార్థులకు ప్లేట్లను పంపిణీ చేశారు.సర్పంచ్ క్యామ నరేందర్, ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డికి చెందిన పలువురు నాయకులు గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన యూనుస్, 2వ వార్డుకు చెందిన నాయకులు మహేష్‌కుమార్ ఎమ్మెల్యే హరీష్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్ కండువాను కప్పుకుని పార్టీలో చేరారు. ఎల్లారెడ్డిలో మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని హరీష్‌రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులున్నారు.
ఇందిరమ్మ ఇంటినిర్మాణం నిలిపివేత
ఇందిరమ్మ ఇంటినిర్మాణం నిలిపివేత
ఇందిరమ్మ ఇంటినిర్మాణం నిలిపివేత


