క్రైం కార్నర్
నవీపేట: మండలంలోని యంచ గ్రామానికి చెందిన గొల్ల అబ్బయ్య(46) గత నెల 6న ఓమన్‌లో మృతి చెందగా గురువారం మృతదేహం గ్రామానికి చేరుకుంది. ఉపాధి నిమిత్తం గొల్ల అబ్బయ్య ఆరు నెలల కిందట ఓమన్ దేశానికి కంపెనీ వీసాపై వెళ్లాడు. అక్కడికి వెళ్లాక బయట పనులు చేస్తూ స్నేహితుల దగ్గర ఉన్నాడు. గత నెల 9న అనారోగ్యంతో మృతి చెందగా మృతదేహం తీసుకువచ్చేందుకు కుటుంబసభ్యుల దగ్గర డబ్బు లు లేవు. సర్పంచ్ బేగరి సాయిలు ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డిని కలువగా సీఎం సహాయ నిధి నుంచి రూ.లక్షన్నరను తక్షణ సహాయం కింద అందజేశారు. గురువారం మృతదేహం గ్రామానికి చేరుకోగా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
బోధన్: ఎడపల్లి మండలంలోని ఏఆర్‌పీ క్యాంప్ గ్రా మ శివారులో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు డీ–46 కెనాల్‌లో గురువారం గుర్తు తెలియని ఏడేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. కెనాల్ నీటిలో కొట్టుకు వస్తున్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సదరు బాలికకు సంబంధించిన గుర్తింపు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ రూరల్ సీఐ విజయబాబు వెల్లడించారు. బాలికకు సంబంధించి ఎవరికై నా సమాచారం తెలిస్తే ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.
బాలిక అదృశ్యం
వర్ని: మోస్రా మండలం చింతకుంట గ్రామానికి చెందిన 15 సంవత్సరాల వయసు గల బాలిక అదృశ్యమైనట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఈ నెల 27న కిరాణా దుకాణానికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం వర్ని పోలీస్ స్టేషన్ బాలిక తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్సై వివరించారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


