సినీ హీరో శ్రీకాంత్ సందడి
కామారెడ్డి అర్బన్: ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్ బుధవారం కామారెడ్డి వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్‌లో నిర్వహించిన ఓ ప్రయివేట్ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించింది. హోటల్ సిబ్బంది, అభిమా నులు నటుడు శ్రీకాంత్‌లో ఫోటోలు, సెల్ఫీలు దిగి సంబురపడ్డారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సోషల్ వర్క్ విభాగం విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా కోర్టులు, న్యాయసేవా సంస్థలను సందర్శించి వివిధ అంశాలను తెలుసుకున్నారు. సత్వర న్యాయం కోసం జిల్లా న్యాయసేవా సంస్థ ద్వా రా ఉచిత న్యాయ సలహా కేంద్రాలు, వాటి ప్ర యోజనాలను ప్రజలకు వివరించాలని సంస్థ జిల్లా కార్యదర్శి టి.నాగరాణి సోషల్ వర్క్ విద్యార్థులకు సూచించారు.సోషల్‌వర్క్ విభా గం అధిపతి జి.శ్రీనివాస్‌రావు, అధ్యాపకులు జి.రమేష్,పీబీ సత్యంతదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎంఏ తెలుగు విభాగం మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ కే.కిష్టయ్య, సమన్వయకర్తలు జయప్రకాష్, శ్రీనివాస్‌రావు, తెలుగుశాఖ అధ్యక్షుడు విశ్వప్రసాద్, అధ్యాపకులు రవికుమార్, మల్లేష్, అంజనేయులు, మహేష్, బాలాజీ, ఎంఏ తెలుగు రెండో సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలో రైతులకు సబ్సిడీ కల్టివేటర్లను బుధవారం సర్పంచ్ ధర్మతేజ, ఏఈవో మీనా అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మండలంలో 9 మంది రైతులకు కల్టివేటర్లు మంజూరు అయ్యాయని తెలిపారు. నాయకులు కృష్ణ, రాజు, నర్సోజి, కిషోర్ తదితరులున్నారు.
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో బుధవారం పిట్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్, చిన్నకొడప్‌గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రాథమిక స్థాయి సమావేశం నిర్వహించారు. ఎంఈవో దేవి సింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు కనీస పఠన నైపుణ్యాలను నేర్పించాలని, త్వరలో జరగబోయే పరీక్షలకు విద్యార్థులకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం అనురాధ, ఆర్పీలు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సినీ హీరో శ్రీకాంత్ సందడి
సినీ హీరో శ్రీకాంత్ సందడి
సినీ హీరో శ్రీకాంత్ సందడి


