క్రీడలతో మానసిక ఉల్లాసం
మద్నూర్(జుక్కల్): క్రీడలు మానసిక ఉల్లాసం వస్తుందని మద్నూర్ సర్పంచ్ మచ్కూరీ ఉష పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం కప్ ఆటల పోటీలను బుధవా రం ఆమె స్థానిక అధికారులతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి సర్పంచ్ కబడ్డీ ఆడి ఉత్సాహాన్ని నింపారు. తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో రాణీ, ఎంపీవో నర్సయ్య, ఉప సర్పంచ్ రమేశ్, నాయకులు సంతోష్, తదితరులున్నారు.
మొబైల్‌ను కాదనుకుంటే భవిష్యత్తు బాగుంటది
భిక్కనూరు: విద్యార్థులు మొబైల్ ఫోన్‌ను కాదనుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని భిక్కనూరు ఎంఈవో రాజగంగారెడ్డి అన్నారు. బుధవారం భిక్కనూరు మండల కేంద్రంలో ప్రారంభించిన సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొబైల్ ఫోన్‌ను మాటలకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భీంరెడ్డి, సర్పంచ్‌లు బల్యాల రేఖ, కుంటలింగారెడ్డి, ఈవో మహేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలపై ఆసక్తి కలిగించేందుకే సీఎం కప్
ఎల్లారెడ్డిరూరల్: గ్రామీణ ప్రాంతాలలోని యువతలో క్రీడలపై ఆసక్తిని కలిగించేందుకు సీఎం కప్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోందని ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రజిత అన్నారు. బుధవారం మాచాపూర్‌లో మండల స్థాయి సీఎం కప్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఎంపీడీవో తాహేరాబేగం, ఎంపీవో ప్రకాష్, తదితరులున్నారు.
పోటీలను విజయవంతం చేయాలి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): సీఎం కప్ పోటీలలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని బుధవారం ఎంపీడీతో అభినవ్ చందర్ కోరారు. మండల స్థాయిలో ఈ నెల 29 నుంచి 31 వరకు జరుగబోయే పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం


