‘ఇస్రో’ యాత్రకు విద్యార్థినులు
కామారెడ్డి టౌన్: విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంపికై న 50 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు బుధవారం శ్రీహరికోటలోని ఇస్రో సందర్శనకు బయలుదేరి వెళ్లారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద వాహనాలను అదనపు కలెక్టర్ విక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. గత నెలలో జిల్లా స్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఈ యాత్రకు ఎంపిక చేశారు. వీరికి తోడుగా 30 మంది ఉపాధ్యాయులు కూడా వెళ్లారు. ఈ పర్యటనలో విద్యార్థినులు శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రంతో పాటు విజయవాడలోని సైన్స్ సెంటర్‌ను సందర్శించనున్నారు. విద్యార్థులు శుక్రవారం తిరిగి జిల్లాకు వస్తారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తమ గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలంలో చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసి జీపీ స్థలాన్ని కాపాడాలంటూ జప్తిజాప్కంపల్లికి చెందిన పలువురు బుధవారం స్థానిక ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామానికి చెందిన జోడు దుర్గయ్య అనే వ్యక్తి ఇంటిి నిర్మాణం చేస్తున్నాడని పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో నామినేషన్ సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఐదుగురు మహిళా పీసీలు, ఐదుగురు కానిస్టేబుల్స్ బందోబస్తులో పాల్గొన్నారు.
‘ఇస్రో’ యాత్రకు విద్యార్థినులు
‘ఇస్రో’ యాత్రకు విద్యార్థినులు


