సమరానికి సైరన్‌! | - | Sakshi
Sakshi News home page

సమరానికి సైరన్‌!

Jan 28 2026 7:19 AM | Updated on Jan 28 2026 7:19 AM

సమరాన

సమరానికి సైరన్‌!

సమరానికి సైరన్‌! అవి చిరుత అడుగులే ‘ప్రతి రైతు సభ్యత్వం తీసుకోవాలి’ విద్యా ప్రమాణాలు పెంచాలి ఐటీఐతో పాలిటెక్నిక్‌ లేటరల్‌ ఎంట్రీకి దరఖాస్తులు బాన్సువాడ బల్దియా.. ఎల్లారెడ్డి బల్దియా..

న్యూస్‌రీల్‌

కామారెడ్డి బల్దియా..

బిచ్కుంద బల్దియా..

ఆ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న

నిర్వాహకులు

విద్యార్థుల ప్రాణాలు పోతున్నా

పట్టించుకోని అధికారులు

– 9లో u

బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026

మద్నూర్‌: మద్నూర్‌ శివారులో చిరుత సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జుక్కల్‌ రేంజ్‌ ఫారెస్ట్‌ అధికారి సుజాత సూచించారు. సోమవారం రాత్రి ఒంటి గంటకు మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో లైన్‌చేంజ్‌ చేస్తున్న సమయంలో చిరుత పులి తన పక్క నుంచి దూకి పారిపోయిందని ఆపరేటర్‌ రాచన్న చెప్పడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆటవీ అధికారులు మంగళవారం సబ్‌ స్టేషన్‌కు వచ్చి పా ద ముద్రలను పరిశీలించారు. చిరుత పులి పా దం 8 సెంటీమీటర్లు వరకు ఉంటుందని, మ ద్నూర్‌లో కనిపించిన గుర్తులు అలానే ఉ న్నాయని ఫారెస్ట్‌ అధికారి సుజాత తెలిపారు. అటవీ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని, రాత్రి వేళల్లో పశువులను వ్యవసాయ క్షేత్రాల్లో ఉంచరాదని సూచించారు. పగటిపూట కూడా ఒంటరిగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లవద్దన్నారు.

దోమకొండ: రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘంలో ప్రతి రైతు సభ్యత్వం నమోదు చేసుకోవాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్‌ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయంలో రైతులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సహకార సంఘంలో రైతు తమ వంతుగా రూ.2 వేలతో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సహకార సంఘం క్లస్టర్‌ అధికారి రమేశ్‌, సొసైటీ సీఈవో బాల్‌రెడ్డి, సంఘం మాజీ డైరెక్టర్‌ రఘురాములు, మాజీ జెడ్పీటీసీ తిరుమలగౌడ్‌, రైతులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: ప్రాథమిక స్థాయిలో విద్యాప్రమాణాలు పెంచాలని అడిషనల్‌ కలెక్టర్‌ విక్టర్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ స్టడీలో జిల్లాను టాప్‌ 5లో ఉంచాలన్నారు. హాజరు శాతం పెంచడం ద్వారా విద్యాప్రమాణాలు మెరుగు పరచవచ్చన్నారు. మిడ్‌ లైన్‌ టెస్ట్‌ ఫలితాలను ఈ సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో డీఈవో రాజు, అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి వేణుగోపాల్‌, సీఎంవో నాగవేందర్‌, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ కృష్ణ చైతన్య, స్టాటిస్టికల్‌ కోఆర్డినేటర్‌ వెంకటరమణారావు, రాష్ట్ర ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌ సభ్యులు సురేందర్‌ ఎంఈవోలు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

బీటెక్‌ పరీక్ష తేదీలు ఖరారు

సిరికొండ: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని బీటెక్‌(సీఎస్‌ఈ, ఏఐ) మొదటి సెమిస్టర్‌(రెగ్యులర్‌) థియరీ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి నిర్వహించనున్నట్లు తెయూ పరీక్షల ని యంత్రణాధికారి సంపత్‌కుమార్‌ ఒక ప్రకటన లో తెలిపారు. పూర్తి వివరాల కోసం తెయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అన్నారు.

బీఎడ్‌ పరీక్షలు..

తెయూ పరిధిలోని బీఎడ్‌ మూడవ సెమిస్టర్‌ ప్రాక్టీకల్‌ పరీక్షల టైం టేబుల్‌ను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌కుమార్‌ తెలిపారు. మొదటి విడత పరీక్షలు వచ్చే నెల 3 నుంచి 7 వరకు, రెండవ విడత పరీక్షలు వచ్చే నెల 9 నుంచి 13 వరకు జరుగుతాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం తెయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అన్నారు.

ఖలీల్‌వాడి(నిజామాబాద్‌ అర్బన్‌): నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లేటరల్‌ ఎంట్రీ (రెండవ సంవత్సరంలో ప్రవేశాలు) కోసం ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ(బాలుర) ప్రిన్సిపాల్‌ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల ఐటీఐ కోర్సును పూర్తి చేసి కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులకు పాలిటెక్నిక్‌ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ ఐటీఐ (బాలుర) కళాశాలలో ఫిబ్రవరి 21లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ నెంబర్‌ 85004 67091ను సంప్రదించాలన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల సమరానికి సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. బుధవారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. వచ్చేనెల 11న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడతాయి. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలోని నాలుగు బల్దియాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్‌ విడుదలతోనే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 92 వార్డులున్నాయి. కామారెడ్డి పట్టణంలో 49 వార్డులు, బాన్సువాడ పట్టణంలో 19, ఎల్లారెడ్డి పట్టణంలో 12, బిచ్కుంద పట్టణంలో 12 వార్డులు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే సన్నద్ధమై ఉంది. వివిధ పనులకు సంబంధించి నోడల్‌ అధికారుల నియామకం ఎప్పుడో పూర్తయ్యింది. ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో వారంతా పూర్తిస్థాయిలో ఎన్నికలకు సమయం కేటాయించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. అవసరమైన బ్యాలెట్‌ బాక్సులను ఇప్పటికే సిద్ధం చేశారు. జంబో బాక్సులు 177, పెద్ద సైజు బాక్సులు 248 అవసరం అవుతాయని అలాగే 20 శాతం అదనంగా పెట్టుకోవాలని నిర్ణయించి మొత్తం 504 బాక్సులను రెడీగా ఉంచారు.

వేడెక్కనున్న పట్టణాలు..

రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. దీంతో పట్టణాల్లో రాజకీయాలు వేడెక్కనున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలు అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆశావహులు, తమకే టికెట్టు దక్కుతుందని నమ్మకంతో ఉన్నవారు ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్టీ టికెట్టు కేటాయించకపోతే పలువురు ప్రత్యామ్నాయాలూ సిద్ధంచేసుకున్నారు. ఇండిపెండెంట్‌గానైనా బరిలో నిలవడానికి చాలామంది ఉత్సాహంతో ఉన్నారు. ఒక్కో పార్టీనుంచి ఒక్కో వార్డులో ముగ్గురు, నలుగురు టికెట్లు ఆశిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాట్లు ఎక్కువగా ఉంటే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ టికెట్టు దక్కని వారు రెబల్‌గా బరిలో దిగే అవకాశాలున్నాయి. చాలాచోట్ల మూడు ప్రధాన పార్టీలు బలంగా ఉండడం, రెబల్‌ బెడద కూడా ఉండడంతో బహుముఖ పోటీ తప్పేట్టు లేదు.

షెడ్యూల్‌ ఇలా..

నోటిఫికేషన్‌ బుధవారం వెలువడుతుంది. ఉదయం 10.30 గంటలనుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్లను పరిశీలించి, చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్‌కు ఫిబ్రవరి 1 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. 2న సాయంత్రం 5లోపు అప్పీల్స్‌ను పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. అదేరోజు పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.

11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. రీపోలింగ్‌ అవసరం ఉంటే 12న నిర్వహిస్తారు. 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

ఎన్నికై నవారితో 16న ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహిస్తారు.

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి పట్టణం 2018లో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది.

2020లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. చైర్మన్‌గా కుడుముల సత్యనారాయణ ఎన్నికయ్యారు. నాలుగేళ్ల అనంతరం అవిశ్వాసం కారణంగా ఆయన పదవి కోల్పోయారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్‌ ఎన్నికై మూడు నెలల పాటు పదవిలో ఉన్నారు.

ప్రస్తుతం మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 24 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

13,265 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 6,321 మంది పురుషులు, 6,943 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గురుకులాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అధికారుల నిర్లక్ష్యం మూలంగా పిల్లల ప్రాణాలు పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో గత ఐదేళ్లలో ఏడాదికొకరు అన్నట్లుగా ఐదుగురు విద్యార్థులు చనిపోయారు. పిల్లల ప్రాణాలు పోతున్నా ఉన్నతాధికారులు మొద్దునిద్ర వీడడం లేదు. తాజాగా బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈనెల 25న ఫర్నిచర్‌ తెచ్చిన ఆటోలో నుంచి దూకడంతో ఎనిమిదో తరగతి విద్యార్థిని సంగీత దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. సంగీత మరణం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రిన్సిపల్‌ ఇంట్లో ఫంక్షన్‌ కోసం గురుకుల పాఠశాల నుంచి ఫర్నిచర్‌ తీసుకువెళ్లడం, ఆ ఫర్నిచర్‌ను దించడానికి విద్యార్థుల సాయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యపు ఘటనలు గురుకులాల్లో గతంలోనూ చోటు చేసుకున్నాయి. అయినా అధికారుల తీరు మారడం లేదు.

కొరవడిన పర్యవేక్షణ...

జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి 35 గురుకుల విద్యాసంస్థల్లో 15,390 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకులాలకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. మంచి సౌకర్యాలు కల్పించాలని ఆదేశిస్తోంది. అయితే చాలాచో ట్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గురుకులాల్లో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియడం లేదు. పిల్లలు అనారోగ్యం పాలవడమో, ప్రాణాలు కోల్పోవడమో జరిగినపుడు తప్ప మరే విషయం బయటకు పొక్కనీయడం లేదు. గతంలో ఉన్నతాధికారులు గురుకులాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేవారు. జిల్లాకు చెందిన అధికారులు కూడా గురుకులాలను పర్యవేక్షించేవారు. దీంతో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండేవారు. అయితే ఇటీవలి కాలంలో గురుకులాలను తనిఖీ చేయడం, పర్యవేక్షించడం తగ్గిపోయింది. దీంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో చాలా చోట్ల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకులాల్లోకి విద్యార్థి సంఘాలను అడుగుపెట్టనీయకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికై నా అధికారులు గురుకులాలపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి బల్దియా 1987లో ఏర్పాటయ్యింది. 1988లో తొలిసారి ఎన్నికలు జరగ్గా.. పార్శి గంగయ్య చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా.. ఏడుగురికి చైర్మన్‌ గిరి దక్కింది. ఇందులో నలుగురు మహిళలు ఉండడం గమనార్హం.

ప్రస్తుతం 49 వార్డుల పరిధిలో 152 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 99,313 మంది ఓటర్లున్నారు. ఇందులో 48,389 మంది పురుషులు, 50,907 మంది మహిళలు, 17 మంది ఇతరులు ఓటు హక్కు కలిగి ఉన్నారు.

బిచ్కుంద : బిచ్కుంద మేజర్‌ పంచాయతీ 2025లో మున్సిపాలిటీ అయ్యింది. బల్దియా అయ్యాక మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇక్కడ 12 వార్డులు ఉండగా.. 24 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

12,759 మంది ఓటేయనున్నారు. ఇందులో పురుషులు 6,201 మంది, మహిళలు 6,556 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.

బాన్సువాడ : బోర్లం క్యాంపులోనా గురుకుల పాఠశాలలో ఆటో నుంచి దూకగా గాయాలపాలైన ఐదుగురు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందన్న విషయమై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. ఈనెల 25న కదులుతున్న ఆటోలోంచి దూకగా విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే. ఇదే ఆటోలోనుంచి అంతకుముందు ఐదుగురు విద్యార్థులు కూడా దూకారు. ఈ విషయం సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించింది. ఓ విద్యార్థినికి కాలు విరిగిందని, తలతోపాటు చేతులకు గాయాలయ్యాయని తెలుస్తోంది. కాగా సంఘటన జరిగిన రోజు ఆమెను ఎవరూ పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా పాఠశాల నర్సు గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. ఇదే ఘటనలో మరో విద్యార్థిని రెండు కాళ్లు, చేతులకు, మరో విద్యార్థినికి చేతులకు గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని ఎవరినీ పాఠశాల సిబ్బంది పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. బాన్సువాడ సబ్‌కలెక్టర్‌ కిరణ్మయి పాఠశాలను సందర్శించిన సమయంలో గాయాలైన విద్యార్థుల వివరాలు బయటికి వచ్చాయి. దీంతో సబ్‌ కలెక్టర్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, గాయపడినవారికి వైద్య పరీక్షలు చేయించారు. విద్యార్థులు గాయపడినా వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో అసలు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

మోగిన పుర భేరి

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

జిల్లాలోని నాలుగు

మున్సిపాలిటీలలో ఏర్పాట్లు

వచ్చే నెల 11న పోలింగ్‌, 13న కౌంటింగ్‌

అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

బాన్సువాడ : బాన్సువాడ పట్టణం 2018లో మున్సిపాలిటీ అయ్యింది.

2020 జనవరిలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మొదటి చైర్మన్‌గా జంగం గంగాధర్‌ ఎన్నికయ్యారు.

19 వార్డులు ఉండగా.. 39 పోలీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

బల్దియాలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 24,188. ఇందులో మహిళలు 12,599 మంది, పురుషులు 11,578 మంది, ఇతరులు 11 మంది ఉన్నారు.

1987లో 24 వార్డులతో ఏర్పాటు

దినదినాభివృద్ధి చెందిన పట్టణం.. ప్రస్తుతం 49 వార్డులు..

చైర్‌పర్సన్‌లుగా నలుగురు

మహిళలకు అవకాశం

సమరానికి సైరన్‌!1
1/7

సమరానికి సైరన్‌!

సమరానికి సైరన్‌!2
2/7

సమరానికి సైరన్‌!

సమరానికి సైరన్‌!3
3/7

సమరానికి సైరన్‌!

సమరానికి సైరన్‌!4
4/7

సమరానికి సైరన్‌!

సమరానికి సైరన్‌!5
5/7

సమరానికి సైరన్‌!

సమరానికి సైరన్‌!6
6/7

సమరానికి సైరన్‌!

సమరానికి సైరన్‌!7
7/7

సమరానికి సైరన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement