ఎల్లారెడ్డిలో మహిళా ఓటర్లే అధికం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా వీటిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. వార్డుల వారీగా కౌన్సిలర్లు ఎన్నిక కావాలంటే మహిళల ఆదరణ ఎవరికి ఉంటే వారు గెలిచే అవకాశాలున్నాయి. ఏదేమైనా పోటీ చేసే కౌన్సిలర్లు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు తప్పనిసరి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 13,264 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,321 మంది కాగా మహిళా ఓటర్లు 6,943 మంది ఉన్నారు. ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
బాన్సువాడ: స్వచ్ఛంద సేవకులు, సీనియర్ జర్నలిస్టు బండ సంగారెడ్డికి నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్సెలెన్స్ అవార్డు–2026 లభించింది. గణతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన బండ సంగారెడ్డి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం క్రియాశీలకంగా పని చేస్తూ ఇంకుడు గుంతల నిర్మాణం వాటి నిర్వహణ పద్ధతులు భూగర్భజలాల పెంపు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినందుకు అవార్డు లభించింది.


