ఉత్కంఠకు తెర
బాన్సువాడ : మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఉత్కంఠకు తెరపడింది. నేటి నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. ఎన్నికల నగరా మోగడంతో వార్డుల్లో ఆశావహులు పెరిగిపోయారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. కొందరు సిట్టింగ్ కౌన్సిలర్లకు అనుకూలంగా రావడం, మరి కొందరి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో పక్క వార్డులపై కన్నేశారు. 2018లో బాన్సువాడ మున్సిపాలిటీగా ఏర్పడింది. 2020లో మున్సిపల్‌కు ఎన్నికలు జరిగాయి. మొదటి మున్సిపల్ చైర్మన్‌గా బీసీ జనరల్‌కు కేటాయించడంతో జంగం గంగాధర్‌కు అదృష్టం దక్కింది. ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. 19 వార్డులను రొటేషన్ పద్ధతిలో కేటాయించడంతో ఒక్కసారిగా ఆశావహులు పెరిగిపోయారు. ఒక్కో వార్డు నుంచి 3 నుంచి 5 వరకు పోటీలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. బి–ఫారం ఎవరి దక్కుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. బి–ఫారం దక్కని వారు వేరే పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కౌన్సిలర్ అభ్యర్థుల అన్వేషణ ప్రారంభించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉండటంతో బి–ఫారం రాని వారు ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డుల్లో 24,188 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 11,578, మహిళలు 12,599 మంది ఓటర్లు ఉన్నారు. 11 మంది ఇతరులున్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి.
వార్డు 2020లో ప్రస్తుతం
1 జనరల్ మహిళ జనరల్ మహిళ
2 ఎస్టీ జనరల్ బీసీ జనరల్
3 జనరల్ మహిళ జనరల్
4 ఎస్సీ మహిళ ఎస్సీ జనరల్
5 జనరల్ జనరల్ మహిళ
6 జనరల్ జనరల్ మహిళ
7 జనరల్ మహిళ బీసీ మహిళ
8 ఎస్సీ జనరల్ ఎస్సీ మహిళ
9 జనరల్ జనరల్ మహిళ
10 జనరల్ మహిళ ఎస్టీ
11 బీసీ జనరల్ జనరల్
12 జనరల్ మహిళ జనరల్
13 జనరల్ జనరల్
14 జనరల్ జనరల్ మహిళ
15 బీసీ జనరల్ బీసీ జనరల్
16 బీసీ మహిళ జనరల్
17 బీసీ మహిళ బీసీ మహిళ
18 బీసీ జనరల్ బీసీ మహిళ
19 బీసీ మహిళ బీసీ జనరల్
మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ
బాన్సువాడ : బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో ఆయా వార్డులకు సంబంధించిన నా మినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గది నంబర్ –1లో..
కౌంటర్ –01లో 1, 2, 3 వార్డులు
కౌంటర్ –02లో 4, 5, 6 వార్డులు
కౌంటర్–03లో 7, 8, 9 వార్డులు
కౌంటర్–04లో 10, 11, 12 వార్డులు
గది నంబర్–02లో
కౌంటర్–05లో 13, 14 వార్డులు
కౌంటర్–06లో 15, 16 వార్డులు
కౌంటర్ –07లో 17, 18, 19వ వార్డులకు నామినేషన్ల పత్రాలు స్వీకరించనున్నారు.
షెడ్యూల్ ప్రకటనతో పెరిగిన
ఆశావహులు
ఒక్కో వార్డులో ముగ్గురి పేర్లు
పరిశీలిస్తున్న అధికార పార్టీ నేతలు
కౌన్సిలర్ అభ్యర్థుల కోసం
బీఆర్‌ఎస్, బీజేపీ అన్వేషణ


