క్రైం కార్నర్
లింగంపేట(ఎల్లారెడ్డి): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా..మండలంలోని పోతాయిపల్లి గ్రామానికి చెందిన బొర్ర వెల్పుల బాలాజీ(23) అనే యువకుడు కొంత కాలంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో నివాసం ఉంటున్నాడు. అతడు పెట్రోల్ పంపులో పని చేస్తుండగా ఇటీవల పనులు ముగించుకొని బైక్‌పై వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం పోతాయిపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
క్రైం కార్నర్


