ఎన్నికల మెటీరియల్ సిద్ధం
బిచ్కుంద(జుక్కల్): మున్సిపల్ ఎన్నికల నోటీఫికేషన్ రావడంతో మంగళవారం బిచ్కుంద బల్దియా అధికారులు ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్‌ను వార్డుల వారీగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. స్ట్రాంగ్‌రూంలకు బ్యాలెట్స్ బాక్సులు, మెటీరియల్ చేరిపోయాయి. నామినేషన్ల డిపాజిట్ రసీదు, డిక్లరేషన్ ఫారం, ఎన్నికల ప్రకటన ఫలితాల ధ్రువీకరణ పత్రాలు, ఏజెంట్ కార్డులు, ఎన్నికల నియమావళి ప్రక్రియ గైడ్‌లైన్స్ బుక్స్ ఇతర సామగ్రి వార్డుల వారీగా ఎన్నికల సిబ్బందికి ఇవ్వడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. బిచ్కుంద పట్టణంలో గణేష్ మందిరం పీఎస్ పాఠశాలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మూడు వార్డులకు ఒక ఆర్‌వోను నియమించారు. నామినేషన్ల స్వీకరణ కోసం నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 నుంచి సాయంత్ర 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.


