ధర్మారెడ్డిలో గుడిసె దగ్ధం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారెడ్డిలో పూరిగుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమయింది. గ్రామంలోని దాసరి కిష్టయ్యకు చెందిన గుడిసెకు సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. వెంటనే కిష్టయ్య గ్రామస్తుల సహాయంతో మంటలను ఆర్పివేశాడు. ఈ ఘటనలో గుడిసెలోని బోరుమోటార్ల పైపులు, స్టార్టర్‌బాక్స్‌లు, వైర్లు ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.60వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి రమేష్, ముదిరాజ్‌సంఘం గ్రామ అధ్యక్షుడు నారాయణ ఘటనస్థలానికి వెళ్లి దగ్ధమైన గుడిసెను పరిశీలించారు.


