జిల్లాలో తొలి బల్దియా కామారెడ్డి | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో తొలి బల్దియా కామారెడ్డి

Jan 28 2026 7:19 AM | Updated on Jan 28 2026 7:19 AM

జిల్లాలో తొలి బల్దియా కామారెడ్డి

జిల్లాలో తొలి బల్దియా కామారెడ్డి

కామారెడ్డి టౌన్‌: జిల్లాలోని తొలి మున్సిపాలిటీ అయిన కామారెడ్డి బల్దియాకు దశాబ్దాల చరిత్ర ఉంది. కామారెడ్డి మున్సిపాలిటీ 1987లో సెకండ్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఏర్పాటయ్యింది. అప్పట్లో 24 వార్డులుండేవి. తర్వాతి కాలంలో ఇవి 33 కు పెరిగాయి. 2014 తర్వాత చుట్టుపక్కల ఉన్న అడ్లూర్‌, టేక్రియాల్‌, లింగాపూర్‌, దేవునిపల్లి, సరంపల్లి, రామేశ్వరపల్లి, ఇల్చీపూర్‌, పాతరాజంపేట గ్రామాలను బల్దియాలో విలీనం చేసి వార్డులను పునర్విభజించారు. 14.11 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బల్దియాలో ప్రస్తుతం 49 వార్డులున్నాయి.

ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు..

● 1987లో కామారెడ్డి బల్దియా ప్రత్యేక అధికారి క్రిష్టోఫర్‌జాన్‌ పాలనతో ప్రారంభమైంది.

● 1988 నుంచి 1992 వరకు చైర్మన్‌గా పార్శి గంగయ్య వ్యవహరించారు. పదవీకాలం ముగిసిన తర్వాత 1995 వరకు ఆర్డీవో ప్రత్యేకాధికారిగా ఉన్నారు.

● 1995 నుంచి 2000 వరకు చైర్మన్‌గా చీల ప్రభాకర్‌, 2000 నుంచి 2005 వరకు చైర్‌పర్సన్‌గా మామిండ్ల లక్ష్మి వ్యవహరించారు. ఆరు నెలలపాటు ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది.

● 2005 నుంచి 2010 వరకు కైలాస్‌ శ్రీనివాస్‌రావు చైర్మన్‌గా ఉన్నారు. 2010 నుంచి 2014 వరకు ప్రత్యేకాధికారి పాలన సాగింది.

● 2014 నుంచి 2019 వరకు చైర్‌పర్సన్‌గా పిప్పిరి సుష్మ పనిచేశారు. వెంటనే ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆరు నెలలపాటు కలెక్టర్‌ సత్యనారాయణ ప్రత్యేకాధికారిగా ఉన్నారు.

● 2020 నుంచి 2024 అగస్టు వరకు చైర్‌పర్సన్‌గా నిట్టు జాహ్నవి వ్యవహరించారు. అవిశ్వాసంతో ఆమె పదవిని కోల్పోయారు. చైర్‌పర్సన్‌గా ఇందుప్రియ జనవరి 2025 వరకు పాలన సాగించారు. ఏడాదిగా ప్రత్యేకాధికారి పాలన సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement