నిబంధనలు పక్కాగా అమలు చేయాలి
కామారెడ్డి క్రైం: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్ నుంచి ఇన్‌చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి కలెక్టరేట్ నుంచి ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, జెడ్పీ సీఈవో చందర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


