క్రమశిక్షణకు మారు పేరు శిశు మందిర్
● ఓయూ తెలుగుశాఖ విభాగం
పూర్వ అధిపతి కసిరెడ్డి వెంకటరెడ్డి
కామారెడ్డి అర్బన్ : సరస్వతి శిశుమందిర్ విద్యాపీఠం పాఠశాలల విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ విభాగం పూర్వ అధిపతి కసిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. దేశభక్తితో సామాజిక సేవ కార్యక్రమాలలో ముందుంటారన్నారు. కామారెడ్డిలోని సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యుల ఆత్మీయ మహా సమ్మేళనాన్ని ఆదివారం శిశుమందిర్‌లో నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఆచార్యులకు పాదపూజలు చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు అలరించాయి. ముఖ్యఅతిథిగా హాజరైన కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఏకాగ్రతతో సహనం కోల్పోకుండా ఉండాలన్నారు. సర్వసతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ గొప్ప వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా సంపూర్ణ వ్యక్తులుగా మారవచ్చన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్ శంకర్, విద్యామందిర్ అధ్యక్షుడు డాక్టర్ శ్యాంసుందర్, ప్రతినిధులు హరిస్మరణ్‌రెడ్డి, ఎం.ఆనంద్, రంజిత్‌మోహన్, ఆకుల భరత్, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిత్యానందం, బొల్లిరాజు, ఉపాధ్యక్షుడు సామల గంగారెడ్డి, ప్రతినిధుఐలు గీరెడ్డి రాజిరెడ్డి, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, వీటీ లాల్, ప్రతాప్ గౌడ్, ధనంజయ్, శివరాత్రి ప్రతాప్, చక్రవర్తిగౌడ్, రామచంద్రారెడ్డి, అశోక్‌రావు, ప్రిన్సిపల్ నాగభూషణం, అకడమిక్ ప్రిన్సిపల్ నగేష్ పాల్గొన్నారు.


