రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Mar 25 2025 1:37 AM | Updated on Mar 25 2025 1:33 AM

ఖలీల్‌వాడి: నగరంలోని వీక్లీ మార్కెట్‌లో సాయికిరణ్‌ అనే వ్యక్తి దుకాణంలో రేషన్‌ బియ్యంను టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌చార్జి అడిషనల్‌ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారు దుకాణంపై దాడి చేసి, 20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష ఉంటుందని, తదుపరి చర్య నిమిత్తం వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వోకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ సీఐ అంజయ్య తెలిపారు. ఎస్సై గోవింద్‌, స్పెషల్‌ పార్టీ సిబ్బంది ఉన్నారు.

వన్నెల్‌(బి)లో మొరం టిప్పర్లు..

బాల్కొండ: మండలంలోని వన్నెల్‌(బి) శివారులో వరద కాలువ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు టిప్పర్లను సోమవారం బాల్కొండ పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్లను, పొక్లెయిన్‌ను బాల్కొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు.

కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి

ఎల్లారెడ్డిరూరల్‌: మండలంలోని వెల్లుట్లపేట గ్రామంలో కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన కొర్వి నారాయణ గ్రామ శివారులో గొర్రెలను మేపుతుండగా అకస్మాత్తుగా కుక్కల గుంపు గొర్రెలపై దాడి చేయడంతో మృత్యువాత పడ్డాయని తెలిపారు. మృతి చెందిన 18 గొర్రెల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

పేకాడుతున్న 8మంది అరెస్టు

బోధన్‌: సాలూర మండల కేంద్రంలో పేకాడుతున్న 8మందిని అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తెలిపారు. సాలూరలోని పంటపొలాల్లో గల పేకాట స్థావరంపై సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌చార్జి అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య, ఎస్సై గోవింద్‌, సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో పేకాడుతున్న 8మందిని పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి 9 సెల్‌ఫోన్‌లు, సుమారు రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం బోధన్‌ రూరల్‌ ఎస్సైకి అప్పగించినట్లు వెల్లడించారు.

రేషన్‌ బియ్యం పట్టివేత
1
1/1

రేషన్‌ బియ్యం పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement