ఆరేళ్ల ప్రేమించుకున్నారు.. ఒకరి పేరు మరొక్కరు టాటూలు వేసుకున్నారు | - | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల ప్రేమించుకున్నారు.. ఒకరి పేరు మరొక్కరు టాటూలు వేసుకున్నారు

Apr 25 2023 8:10 AM | Updated on Apr 25 2023 8:10 AM

- - Sakshi

హైదరబాద్‌లో కలిసి చాలా సందర్భాల్లో ఫొటోలు కూడా దిగామని మౌనిక చెప్పింది.

కామారెడ్డి: ఆరేళ్ల పాటు ప్రేమించి.. పెళ్లి చేసుకొమ్మని అడగడంతో నిరాకరించిన యువకుడి ఇంటి ఎదుట యువతి బైఠాయించి నిరసన తెలిపిన ఘటన సోమవారం మండలంలోని తుజాల్‌పూర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. దోమకొండకు చెందిన మెతుకు మౌనిక డిగ్రీ చేస్తున్న సమయంలో తుజాల్‌పూర్‌ గ్రామానికి చెందిన అందె నాగరాజ్‌గౌడ్‌తో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఒకరి పేరు మరొక్కరు టాటూలు వేసుకున్నామని, హైదరబాద్‌లో కలిసి చాలా సందర్భాల్లో ఫొటోలు కూడా దిగామని మౌనిక చెప్పింది. తీరా పెళ్లి చేసుకొమ్మని అడగడంతో నిరాకరించడమే కాకుండా దుర్భాషలాడుతున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. గత పది రోజుల క్రితం సైతం పోలీసుల వద్దకు వెళ్లి వివరాలు తెలిపామని, అయినా పెళ్లి చేసుకోవడం లేదని తెలిపింది. పెళ్లి చేసుకునే వరకు యువకుడి ఇంటి ముందు నుంచి కదిలేది లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement