లో
శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2026
ఓటరు
తీర్పు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 401 ఎంపీటీసీ స్థానాలుండగా వీటిలో 6 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 395 ఎంపీటీసీ, 20 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు జిల్లాలో మొత్తం 11,68,848 ఓటర్లుండగా వీరిలో 8,05,765 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కోటనందూరు మండలంలో 30,921 మంది, అత్యల్పంగా శంఖవరం మండలంలో 28,910 మంది ఓట్లు వేశారు. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా 68.94 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి, కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఆయా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మందకొడిగా ప్రారంభం
పోలింగ్ ఉదయం మందకొడిగా సాగి, సాయంత్రానికి ఊపందుకుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 9 గంటల సమయానికి 9.75 శాతం మాత్రమే నమోదైంది. 11 గంటలకు 28.02 శాతానికి చేరింది. మధ్యాహ్నం ఒంటిగంటకు 43.70 శాతం, 3 గంటలకు 55.75 శాతానికి చేరింది. సాయంత్రం 5 గంటలకు 67.40 శాతం ఉండగా.. పోలింగ్ ముగిసే సమయానికి ఇది 68.94 శాతానికి పెరిగింది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు పల్లె ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని అర్థమవుతోంది.
చెదురుమదురు ఘటనలు
● పిఠాపురం మండలం కందరాడలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కందరాడ ఎంపీటీసీ స్థానాన్ని జనసేన నాయకుడు పిల్లా శివశంకర్ ఆశించారు. ఆ స్థానాన్ని వేరే వ్యక్తికి కేటాయించడంతో శివశంకర్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థికి మద్దతుగా పోలింగ్ జరుగుతున్న ప్రాంతానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రావడంతో... శివశంకర్ తల్లిదండ్రులు ఆయనను హత్తుకుని, ‘శివ కూడా మీవాడే కదా! ఎందుకింత రాజకీయం చేస్తున్నారు? అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారు?’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సన్నివేశం అక్కడ ఉన్నవారందరినీ ఆలోచింపజేసింది. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లని కాకుండా ఇతరులకు సీట్లు కట్టబెట్టడంపై జనసైనికులే మండిపడుతున్నారు.
● పిఠాపురం మండలం మంగితుర్తి పోలింగ్ కేంద్రంలో కూటమికి చెందిన వ్యక్తి హల్చల్ చేశారు. అతడితో పాటు కొంత మంది క్యూలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. సైకిల్, గ్లాస్‌కు ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు. వారిని స్వతంత్ర, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అధికారులు కలుగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
● జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్లకార్డులు పట్టుకొని అభ్యర్థి ఫొటోతో ఉన్న టీ షర్టులు ధరించారు. జగ్గంపేట సెంటర్లో ప్రచారం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం.
● ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ట్రాన్స్ఫార్మర్ పాడవడంతో 37, 38, 39 పోలింగ్ కేంద్రాల్లో అంధకారం నెలకొంది. దీంతో, అధికారులు టార్చిలైట్ వెలుతురులోనే విధులు నిర్వహించాల్సి వచ్చింది.
II
మండలాల వారీగా పోలింగ్ వివరాలు
మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం
గండేపల్లి 46,106 32,501 70.49
గొల్లప్రోలు 44,754 32,132 71.80
జగ్గంపేట 67,202 44,708 66.53
కాజులూరు 57,081 38,237 66.99
కాకినాడ రూరల్ 60,976 40,740 66.81
కరప 64,807 42,842 66.11
కిర్లంపూడి 60,739 39,802 65.53
పెదపూడి 60,439 40,982 67.81
పెద్దాపురం 60,740 45,346 74.66
పిఠాపురం 63,199 44,005 69.63
ప్రత్తిపాడు 66,292 44,655 67.36
రౌతులపూడి 43,583 31,330 71.89
సామర్లకోట 71,067 48,377 68.07
తాళ్లరేవు 67,171 47,730 71.06
తొండంగి 75,673 49,775 65.78
తుని 67,255 48,554 72.19
యూ.కొత్తపల్లి 67,842 49,059 72.31
ఏలేశ్వరం 37,492 25,159 67.1
పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్
జగ్గంపేట మండలం కాట్రావుపల్లిలో పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ కలెక్టర్ ప్రియతో కలిసి సందర్శించారు. పోలింగ్ నిర్వహణ, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతంగా, పారదర్శకంగా పోలింగ్ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ముగిసిన జెడ్పీటీసీ,
ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
జిల్లావ్యాప్తంగా 68.94 శాతం ఓటింగ్
అత్యధికంగా కోటనందూరులో
77.49 శాతం
శంఖవరంలో అత్యల్పంగా
62.14 శాతం నమోదు


