కళ్లెదుటే ఉన్నా కనిపించలేదా? | - | Sakshi
Sakshi News home page

కళ్లెదుటే ఉన్నా కనిపించలేదా?

Nov 6 2026 12:09 AM | Updated on Nov 6 2026 12:09 AM

● గొల్లపాలెంలో కొండెక్కిన కోడ్‌

● పట్టించుకోని అధికారులు

కాజులూరు: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమలులోకి వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో సైతం అధికారులు పార్టీ స్థూపాలకు, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు. పార్టీలకు సంబంధం లేని ఫెక్సీలను సైతం నిర్దాక్షిణ్యంగా తొలగించారు. కానీ, కాకినాడ – కోటిపల్లి ప్రధాన రహదారిలో కాజులూరు మండలం గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్‌ గేటు పక్కనే ఉన్న జనసేన జెండా స్తంభం దిమ్మను మాత్రం ఎందుకో వదిలేశారు. మార్కెట్‌ సెంటర్‌లోని ఈ పాఠశాల ముందు నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు, అధికారులు నిత్యం సంచరిస్తూంటారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఇదే పాఠశాలలో 5 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు జనసేన స్థూపాన్ని చూస్తూనే లోపలకు వెళ్లి ఓట్లు వేశారు. గత రెండు రోజులుగా ఈ పోలింగ్‌ కేంద్రాన్ని పలువురు జిల్లా స్థాయి ఎన్నికల, పోలీసు అధికారులు సైతం సందర్శించారు. అయినప్పటికీ వారెవ్వరూ ఈ స్థూపాన్ని పట్టించుకోకపోవడం విచిత్రం. దీనిపై ఎన్నికల సమయంలో పరిశీలనకు వచ్చి పోలీసు స్పెషల్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా వెళ్లిపోయారని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పలువురు విమర్శించారు. ప్రభుత్వ పాఠశాల గేటును ఆనుకుని జనసేన పార్టీ స్థూపాన్ని నిర్మించడంపై అప్పట్లో వైఎస్సార్‌ సీపీ, టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. కనీసం ఈ ఎన్నికల సమయంలోనైనా కాస్త ముసుగు వేయించి, నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని స్థానికులు అంటున్నారు. కూటమి పార్టీలకు అధికారులు ఎంతగా దాసోహం అంటున్నారో చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణనే విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement