ఏఐతో అపార అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

ఏఐతో అపార అవకాశాలు

Nov 6 2026 12:09 AM | Updated on Nov 6 2026 12:09 AM

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ – ఏఐ) సాంకేతికత భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ కీలక పాత్ర పోషించనున్నదని, దీని ద్వారా అపార అవకాశాలు లభిస్తాయని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై యువత ఇప్పటి నుంచే పట్టు సాధించి, నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గోదావరి ప్రాంతంలో ఏఐ సాంకేతికతను ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై యువతకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా కాకినాడలోని ఫాబిన్‌ సమావేశ మందిరం(గోదావరి కళాక్షేత్రం)లో గురువారం నిర్వహించిన కృత్రిమ మేధస్సు సమ్మేళనం–2026 రెండో విడత కార్యక్రమాన్ని ఆయ న ప్రారంభించారు. ఏపీ డీటీఐ నెట్‌వర్క్‌, డీప్‌టెక్‌ నైపుణ్య ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, బాష్‌, టీసీఎస్‌ తదితర ప్రముఖ సంస్థలకు చెందిన సాంకేతిక నిపుణులు ఏఐ ఆధారిత స్వయంచాలక వ్యవస్థలు, నూతన నమూనాలు, ఉద్యోగావకాశాలు, ఆవిష్కరణల్లో ఈ సాంకేతికత పాత్ర వంటి అంశాలపై తమ అనుభవాలను పంచుకున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక తదితర అనేక రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తోందని వివరించారు. విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణలో వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీ డీటీఐ నెట్‌వర్క్‌, టాలెంట్‌ ఏపీ ఛైర్మన్‌ శ్రీధర్‌ కొసరాజు, టాలెంట్‌ ఏపీ అధ్యక్షుడు, ఇన్ఫోసిస్‌ సేవా కేంద్రం అధిపతి సురేష్‌ నర్రా, ఐటీఏఏపీ ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కె., కైట్‌ విద్యా సంస్థల చైర్మన్‌ పీవీ విశ్వం, కై ట్‌ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ వై.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement