కరప: నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 27న ముగుస్తుందని, ఆలోగా ఎంపీటీసీ అభ్యర్థులు తమ పార్టీ బీ–ఫారాలు అందజేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.లావణ్యవేణి సూచించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆమె శుక్రవారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ విధానం, ఇప్ప టి వరకూ దాఖలైన నామినేషన్లు, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.శ్రీనివాసరావును అడిగి వివరాలు తె లుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్నీ అధికారులను అడిగి తెలుసుకుని, ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పక్కాగా పాటించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జె.శ్రీనివాస్, తహసీల్దార్ ఆకుల లక్ష్మీ సరస్వతి, డిప్యూటీ ఎంపీడీఓ ఎస్‌వీ శ్రీనివాసరావు, మండల సచివాలయాల అధికా రి కర్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ నిర్వహణలో
నిబంధనలు పాటించాలి
సామర్లకోట: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధుల నిర్వహణలో సిబ్బంది, అధికారులు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో పోలింగ్ అధికారులు (పీఓ), ఏపీఓలకు నిర్వహిస్తున్న శిక్షణలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఎన్నికల అధికారులు హ్యాండ్ బుక్‌ను ఒకటికి రెండు పర్యాయాలు చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల సామగ్రి తీసుకునే సమయం నుంచి పోలింగ్ అనంతరం తిరిగి రిసెప్షన్ కేంద్రంలో అప్పగించేంత వరకు బ్యాలెట్ పేపర్లు, బాక్సుల భద్రతకు అధికారులు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పోలింగ్ వివరాల నివేదికలు క్రమం తప్పకుండా అందించాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దాపురం ఆర్‌డీఓ పి.కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ ఎన్.కనకరావు, రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు.


