వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు

Oct 24 2026 5:47 AM | Updated on Oct 24 2026 5:47 AM

రౌతులపూడి: మండలంలోని ములగపూడిలో టీడీపీకి చెందిన 100 మంది వైఎస్సార్‌ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు సమక్షంలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు. వారికి గిరిబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామానికి చెందిన న్యాయవాది కాపారపు నిర్మల్‌ కుమార్‌, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ కాపారపు నూకరాజు, ఎస్సీ పేటలోని పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కాపారపు శ్రీనివాప్‌, మాజీ స్కూల్‌ చైర్మన్‌ కాపారపు అర్జునుడు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ, తన తండ్రి ఆదేశాల మేరకు ములగపూడిలోనే తన రాజకీయ ఆరంగేట్రం ప్రారంభించానని, ఈ ఎన్నికల్లో అందరూ పార్టీ విజయానికి కృషి చేసి ఇక్కడి నుంచే తన విజయానికి నాంది పలకాలని కోరారు. జెడ్పీటీసీ అభ్యర్థి గొల్లు శారదను, ఎంపీటీసీ అభ్యర్థి అంకంరెడ్డి కల్యాణ రాజేశ్వరిని ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గిరిబాబు అభ్యర్థిచారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎంపీపీ అభ్యర్థి వాసిరెడ్డి జమీలు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గొల్లు చినదివాణం, పార్టీ సీనియర్‌ నాయకుడు వాసిరెడ్డి భాస్కరబాబు, మండల కన్వీనర్‌ సీహెచ్‌వీవీ సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ అంకంరెడ్డి సతీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement