● వారికి నిబంధనలు వర్తించవా?
● ఎన్నికల నిబంధనలను తుంగలో
తొక్కిన జనసేన శ్రేణులు
కొత్తపల్లి: ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణలో అధికార కూటమిలోని జనసేన నాయకులు ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. స్థానిక మండల పరిషత్ కా ర్యాలయంలో చివరి రోజైన శుక్రవారం నామినేష న్లు వేసేందుకు పలువురు అభ్యర్థులు వచ్చారు. నిబంధనల ప్రకారం వైఎస్సార్ సీపీ నుంచి అభ్యర్థితో పా టు మరో ఇద్దరిని మాత్రమే నామినేషన్ కేంద్రం లోపలకు అనుమతించారు. కానీ, జనసేన పార్టీ అభ్యర్థులు మా త్రం నిబంధనలను అతిక్రమించి, భారీ సంఖ్యలో పా ర్టీ జెండాలతో వచ్చినప్పటికీ అధికారులు, పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. వారి తీరుతో పిఠాపురం – ఉప్పాడ రోడ్డులో మండల పరిషత్ కార్యాలయం నుంచి కొత్తపల్లి ఊర చెరువు సెంటర్ వరకూ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎంత అధికారంలో ఉంటే మాత్రం నిబంధనలను పట్టించుకోరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


