ప్రభుత్వ వైఫల్యాలే మనకు బలం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యాలే మనకు బలం

Oct 19 2026 12:14 AM | Updated on Oct 19 2026 12:14 AM

తుని: ప్రభుత్వ వైఫల్యాలు కూటమికి చెంపపెట్టులా మారాయని, అవే మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయానికి బలమైన బాటలు వేస్తాయని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఆదివారం తుని పాత బజారువీధిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పిట్ల రామతులసి, పలువురు కౌన్సిలర్‌ అభ్యర్థులతో కలసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అడుగడుగునా మహిళలు మంగళ హారతులు పట్టారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే సంక్షేమం అందిందని పలువురు మహిళలు రాజా ఎదుట చెప్పారు. పథకాలు అందించడంలో జగన్‌మోహన్‌రెడ్డికి ఎవరూ సాటిరారని, కూటమి ప్రభుత్వంలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశానికి చేరాయన్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రజా మద్దతు ఉండాలని, ఒకసారి కూటమికి ఓటు వేసి మోసపోయారని, మళ్లీ ఆ పని చేయవద్దని రాజా విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత 25వ వార్డులో ఎన్నో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో వైఎస్సార్‌ సీపీ పోటీ చేస్తే ఓడిపోతామనే భయం వచ్చిందన్నారు. అందుకే పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ గూండాలతో అరాచకాలు చేయిస్తుందని మండిపడ్డారు. తునిలో టీడీపీ చరిత్రకు బ్రేక్‌ పడిందన్నారు. జనసేనకు చైర్‌పర్సన్‌ పదవిని కేటాయించిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కిమ్మనలేదన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పిట్ల రామతులసి, 25వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి మర్నీడి వెంకట సూర్యామణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు అన్నవరం శ్రీను, మున్సిపల్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణాగౌడ్‌, పలువురు కౌన్సిలర్ల అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.

ఫ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

దాడిశెట్టి రాజా

ఫ మున్సిపల్‌ ఎన్నికల్లో

కూటమికి పరాభవమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement