వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు

Oct 19 2026 12:14 AM | Updated on Oct 19 2026 12:14 AM

కాకినాడ రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల వేళ మండలంలోని రేపూరు గ్రామానికి చెందిన టీడీపీ, జనసేనలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం రాత్రి వైఎస్సార్‌ సీపీలో చేరారు. కాకినాడ వైద్యనగర్‌లోని వైఎస్సార్‌ సీపీ రూరల్‌ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు సమక్షంలో రేపూరు గ్రామానికి చెందిన నేతలు చేరారు. వీరికి కన్నబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌ సీపీలో చేరిన వారిలో ముద్రగడ మాణిక్యాల దేవి, ముద్రగడ తిరుపతిరావు, ముద్రగడ వీరరాఘవులు, పెండెం వీర్రాజు, పెండెం శ్రీను, వెలుగుబంట్ల సత్తిబాబు, తలాటం నాగేశ్వరరావు, తలాటం రామకృష్ణ, తలాటం పెదకాపు, తలాటం తాతీలు ఎడాకుల అక్షయ్‌, దామలంక పేర్రాజు తదితరులు సుమారు 50 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ప్రజా బలంతో విజయం సాధిస్తారన్నారు. రేపూరు గ్రామ వైఎస్సార్‌ సీపీ నాయకులు తలాటం ధర్మరాజు, నల్లా సత్యనారాయణ, ముద్దన సూరిబాబు, ముమ్మిడి కనకరాజు, అడపా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

ఆహ్వానించిన మాజీ మంత్రి కన్నబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement