రూ.9 లక్షలతో..
కరప మండలం అరట్లకట్ట గ్రామంలోని భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామివారి ఆలయంలో అమ్మవారిని, ప్రాంగణంలోని దేవతామూర్తులను రూ.లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం చేసి అర్చకులు కొంతేటి సత్యనారాయణమూర్తి, కొంతేటి శివ ప్రత్యేక పూజలు జరిపారు. – కరప
కోటి కాంతులు
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రావులపాలెంలోని కేఎస్ఆర్ కాంప్లెక్స్లో అమ్మవారితో పాటు మండపాన్ని శనివారం రూ.కోటితో అలంకరించారు. ఒక్క రూపాయి నుంచి 10, 20, 50, 100 రూపాయల నోట్లు వినియోగించారు. మహాలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావచ్చారు.
– రావులపాలెం
అనపర్తిలో 9 లక్షలతో..
అనపర్తిలోని శేషగిరిరావుపేట సాయిబాబా మందిరంలో నెలకొల్పిన విజయ కనకదుర్గ పీఠంలో శనివారం అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని రూ.9 లక్షల విలువైన రూ.50, రూ.100, రూ.500 నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. పీఠం అర్చకుడు ఈశ్వర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– అనపర్తి
లోవ దేవస్థానంలో కొలువైన తలుపులమ్మ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. వేద పండితులు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం దీపాలంకర సేవ వైభవోపేతంగా జరిగింది.
– తుని రూరల్
అన్నవరంలోని రత్నగిరిపై కొలువైన వనదుర్గమ్మను శనివారం సరస్వతీ దేవిగా అలంకరించి, పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
– అన్నవరం


