చదువుల తల్లి.. కల్పవల్లి | - | Sakshi
Sakshi News home page

చదువుల తల్లి.. కల్పవల్లి

Oct 18 2026 12:24 AM | Updated on Oct 18 2026 12:24 AM

కాకినాడ రూరల్‌: చదువుల తల్లి.. మా కల్పవల్లి అంటూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రమణయ్యపేట శ్రీపీఠంలో వేలాది మంది విద్యార్థులు మహా సరస్వతి పూజ చేశారు. శనివారం శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి విద్యార్థుల్లో సరస్వతి ఉపాసన చేసి శాస్త్రోక్తంగా సంకల్పం, పూజ చేయించారు. ఉదయం ఆరు గంటల నుంచే జిల్లా నలుమూలల నుంచి విద్యార్థిని, విద్యార్థులు తరలి రావడంతో ట్రాఫిక్‌ సమస్య లేకుండా సర్పవరం పోలీసులు, కాకినాడ ట్రాఫిక్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు సరస్వతీ కటాక్షం కలగాలని, భవిష్యత్తులో ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని సరస్వతీ హోమం జరిపించారు. ఐశ్వర్యాంబికా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ నవరాత్రుల్లో మహా సరస్వతి పూజకు ప్రాధాన్యాన్ని వివరించారు. చిన్నతనం నుంచే పిల్లలకు మంచి సంస్కారం, ఆధ్యాత్మిక విలువలు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహాశక్తి యాగంలో భాగంగా 7వ రోజు ఉదయం 10 గంటల నుంచి వేలాది మంది మహిళలతో కుంకుమార్చనలు జరిపించారు.

శ్రీపీఠంలో విద్యార్థులతో మహా సరస్వతి పూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement