జనసేనతో టీ‘ఢీ’పీ | - | Sakshi
Sakshi News home page

జనసేనతో టీ‘ఢీ’పీ

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

గొల్లప్రోలు (పిఠాపురం రూరల్‌): గొల్లప్రోలు మున్సిపల్‌ ఎన్నికల్లో 23 వార్డుల్లోనూ పోటీకి సిద్ధమని టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ప్రకటించారు. జనసేన కారణంగా టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు సుబ్బారావును నిలదీశారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని, ఎంత కాలం ఓపిక పట్టాలని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ ఓటమికి పని చేసిన వారే ఇప్పుడు జనసేన నుంచి సీట్లు పొంది పోటీలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని, కూటమి వచ్చాక రాజకీయం సర్వనాశనమైందని మండిపడ్డారు. పార్టీకి అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయించి, అహర్నిశలూ కష్టపడి చేశామని, తామందరం కచ్చితంగా అన్ని వార్డుల్లోనూ పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. పిఠాపురం నుంచి కొంత మంది నాయకులు గొల్లప్రోలు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వారి ముందే సుబ్బారావుతో స్థానిక నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లో 23 వార్డుల్లోనూ పోటీకి సిద్ధమని సుబ్బారావు ప్రకటించారు. ఒకవైపు కూటమి పెద్దలు సీట్ల సర్దుబాటు అయిందని ప్రకటిస్తున్నా క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం కొలిక్కిరాలేదు. నామినేషన్ల తొలి రోజు ముగిసినా ఎవరికెన్ని సీట్లు, చైర్మన్‌ అభ్యర్థి ఎవరు వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో పోటీకి సిద్ధమైన నాయకులు ఇదెక్కడి కూటమి అంటూ తలలు పట్టుకుంటున్నారు.

ఫ గొల్లప్రోలులో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమన్న టీడీపీ నేతలు

ఫ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన

ఫ లోకేష్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement