టీడీపీని వీడి.. వైఎస్సార్‌ సీపీ గూటికి.. | - | Sakshi
Sakshi News home page

టీడీపీని వీడి.. వైఎస్సార్‌ సీపీ గూటికి..

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

కిర్లంపూడి: ప్రత్తిపాడు నియోజకవర్గంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరా రు. శంఖవరం మండలం జి.కొత్తపల్లికి చెందిన ఈగల అప్పారావు, ఈగల గంగా వెంకట సతీష్‌ ఆధ్వ ర్యాన టీడీపీ సీనియర్‌ నాయకుడు మఠం సత్యనారాయణతో పాటు మరో 40 కుటుంబాల వారు శుక్రవారం వైఎస్సార్‌ సీపీకి జైకొట్టారు. వారికి పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు వైఎస్సార్‌ సీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కిర్లంపూడిలోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్యనారాయణమాట్లాడుతూ, రానున్న స్థానిక ఎన్నికల్లో గిరిబాబు నాయకత్వంలో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నా మని తెలిపారు. పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని గిరిబాబు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, ఏలేశ్వరం మండలం లింగంపర్తి సొసైటీ మాజీ అధ్యక్షుడు చిక్కాల లక్ష్మణరావు, ఆయన భార్య, మాజీ వైస్‌ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్షితో పాటు టీడీపీకి చెందిన మరో 45 కుటుంబాల వారు గిరిబాబు సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement