అవగాహనతో ఎన్నికల విధుల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

అవగాహనతో ఎన్నికల విధుల నిర్వహణ

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): స్థానిక సంస్థల ఎన్నికల విధులను నోడల్‌ అధికారులు పూర్తి అవగాహనతో, సమన్వయంతో, జవాబుదారీతనంతో నిర్వహించాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోడల్‌ అధికారులకు కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ప్రతి అంశాన్నీ నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం, అభ్యర్థుల గుర్తులు కేటాయించి, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ చేపట్టాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలపై దృష్టి పెట్టాలన్నారు. పోలింగ్‌ నిర్వహణకు 9,900 మంది ఉద్యోగులను నియమించామని చెప్పారు. అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సమాచార వ్యవస్థను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రియ పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఎన్నికల విధి నిర్వహణ

పిఠాపురం: మున్సిపల్‌ ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. గొల్లప్రోలులోని శేఠ్‌ పేరాజీ లుంబాజీ జెడ్పీ బాలుర హైస్కూలులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ సెంటర్లు, స్ట్రాంగ్‌ రూము, కౌంటింగ్‌ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో గొల్లప్రోలు మున్సిపల్‌ కమిషనర్‌ దివిజా సంపతి తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

పిఠాపురంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ బిందుమాధవ్‌ పరిశీలించారు. ఇందిరా నగర్‌తో పాటు ఒకటో వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి పరిస్థితులను సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement