తెలుగు భాషకు ప్రభుత్వమే మరింత ప్రాచుర్యం కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. తెలుగు భాషలో జీఓలు విడుదల చేయడమే కాదు.. మన భాషను విస్మరించే వారిపై చర్యలు తీసుకోవాలి. తెలుగు మాట్లాడితే శిక్షలు విధించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగు మీడియం విద్యార్థులకు ప్రాధాన్యం కల్పించాలి. – ఎండీ సత్యనారాయణరెడ్డి,
విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, రాజమహేంద్రవరం
తెలుగు మీడియం కొనసాగించాలి
మాతృభాష తెలుగు పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంతో పాటు తప్పనిసరిగా తెలుగు మీడియం కూడా కొనసాగించాలి. తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పు రావాలి. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
– పెరవలి ఏసుబాబు, జిల్లా అధ్యక్షుడు,
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్,
తూర్పు గోదావరి జిల్లా


