సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎవరి గోల వారిదే అన్నట్టు కూటమి పాలన సాగుతోంది.. చిన్న పనిచేసినా తామే చేశామని చెప్పుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.. అసలు దాతలను పక్కనపెట్టేసి తమ క్రెడిట్ అంటూ ప్రజాప్రతినిధులు చెప్పుకోవడం జనానికి విస్తుపుట్టిస్తోంది. నిధులు ఒకరివి.. క్రెడిట్ మాత్రం తాము కొట్టేసేందుకు టీడీపీ, జనసేన ఎంపీలు విశ్వప్రయత్నాలు గందరగోళానికి గురిచేస్తోంది. క్యాన్సన్ యంత్రం నేను తెచ్చానని ఒక ఎంపీ వెల్లడిస్తే.. తమ అధినేత కృషితోనే అని మరో ఎంపీ స్పష్టం చేయడం ఆయా పార్టీ శ్రేణుల్లో అయోమయానికి గురి చేస్తోంది. ఎవరికి వారే క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారే తప్ప.. ఇద్దరు ఎంపీల కృషితో వచ్చిందని ప్రెస్‌నోట్‌లలో చెప్పకపోవడం శోచనీయం. ఇద్దరి మధ్యలో నలిగిపోవడం ఎందుకని భావించిన అధికారులు మాత్రం ఇద్దరి కృషి వల్లే అందిందంటూ చెప్పి చేతులు దులిపేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
కాకినాడ జీజీహెచ్‌కు క్యాన్సర్ సేవల కోసం హైఎనర్జీ యాక్సిలరేటర్ మెషీన్ మంజూరైంది. ఓఎన్‌జీసీ సంస్థ సౌజన్యంతో ఈ పరికరం సమకూరింది. రూ.36.6 కోట్ల విలువైన యంత్రం శనివారం జీజీహెచ్‌కు చేరింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇప్పటి నుంచే అసలు ప్రచారం మొదలైంది. తన చొరవతోనే యంత్రం సమకూరిందని టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్, తాను, పవన్ కళ్యాణ్ కృషితో జీజీహెచ్‌కు చేరిందని జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొనడాన్ని చూస్తే, చంద్రబాబు వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారా..? అనే అనుమానం కలగకమానదు. ఎవరివో నిధులైతే.. తమవల్లే అంటూ సొంత డబ్బా కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఓఎన్జీసీ సంస్థ మంజూరు చేసిన నిధులతో సమకూరిన యంత్రాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. క్రెడిట్ చోరీలో చంద్రబాబే ఘనుడు అనుకుంటే.. ఇద్దరు ఎంపీలు ఆయన కంటే ఘనుల్లా ఉన్నారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జనసేన, టీడీపీ మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్న తరుణంలో ఈ పరిణామం ఇరుపార్టీల నేతల్లో మరింత ఆజ్యం పోస్తోంది. ఒకవేళ నిజంగా ఇద్దరి చొరవతో పరికరం మంజూరైందని అనుకున్నా.. మిత్రపక్షమైన ఇద్దరు ఎంపీలు వేర్వేరుగా పత్రికా ప్రకటనలు విడుదల చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిని బట్టి చూస్తే కూటమి నేతల మధ్య సఖ్యత కొరవడిందన్న విషయం స్పష్టమవుతోంది. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎంపీల మధ్య సయోధ్య లేకపోవడంపై ఆయా పార్టీల శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. చిన్న విషయానికే ఇద్దరు వేర్వేరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితేంటన్న వాదన వినిపిస్తోంది.
సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ఫ ప్రచారం కోసం పాకులాట
ఫ జీజీహెచ్‌కు ఓఎన్జీసీ
సౌజన్యంతో క్యాన్సర్ యంత్రం
ఫ తమ వల్లే వచ్చిందంటూ
టీడీపీ, జనసేన ఎంపీల ప్రకటనలు
ఫ యంత్రం ఇచ్చిన సంస్థను
విస్మరించిన నేతలు
నా చొరవతోనే..
కాకినాడ జీజీహెచ్‌కు అధునాతన క్యాన్సర్ చికిత్స సదుపాయాల కల్పనకు తన చొరవతోనే హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్, సిటీ సిమ్యులేటర్ వంటి పరికరాలతో క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటైందని టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కలసి కోరానన్నారు. దీంతో పాటు ఢిల్లీలో ఓఎన్జీసీ అధికారులతో పలుమార్లు చర్చించినట్లు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఓఎన్జీసీ ముందుకొచ్చి సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేసినట్లు, యంత్రం ఏర్పాటైనట్లు పేర్కొన్నారు.
పవన్, నా కృషితో..
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో కాకినాడ జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటైందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. చికిత్సలను అందుబాటులోకి తెచ్చేందుకు రెండేళ్లుగా తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పలుమార్లు జీజీహెచ్ వైద్యులు, పార్లమెంట్ సమావేశాల్లో అంశాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు. నిరంతర సంప్రదింపులతో ఓఎన్జీసీ సంస్థ సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.36.6 కోట్ల వ్యయంతో అత్యాధునిక యంత్రాన్ని సమకూర్చిందన్నారు.


