రత్నగిరి.. అగ్నిఝరి | - | Sakshi
Sakshi News home page

రత్నగిరి.. అగ్నిఝరి

Jun 6 2026 12:23 AM | Updated on Jun 6 2026 12:23 AM

రత్నగిరి.. అగ్నిఝరి

మార్తాండుని ప్రచండ తాండవంతో రత్నగిరి శుక్రవారం అగ్ని‘ఝరి’ని తలపించింది. 40 డిగ్రీల సెల్సియస్‌కు పైబడిన ఎండ వేడిని తట్టుకోలేక సత్యదేవుని దర్శనానికి వేలాదిగా వచ్చిన భక్తులు అల్లాడి పోయారు. ఎండ వేడికి పెనంలా మారిన నేలపై నడవలేక చిన్నారులు, మహిళలతో పాటు పలువురు భక్తులు నీడ కోసం పరుగులు తీశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆలయ ప్రాంగణంలోని చలువ పందిళ్లు, విశ్రాంతి మండపాలు, చెట్ల నీడన సేద తీరారు. సూర్య ప్రతాపం ప్రభావంతో సత్యదేవుని మెట్ల దారి, టోల్‌గేట్‌, పశ్చిమ రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణం, ఘాట్‌ రోడ్లు దాదాపు నిర్మాన్యుషంగా దర్శనమిచ్చాయి. శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని, ఎండ కూడా 40 డిగ్రీలకు పైబడే అవకాశం ఉందని. ఎండ బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

– అన్నవరం

విశ్రాంతి షెడ్డు వద్ద దేవస్థానం బస్సుల కోసం భక్తుల ఎదురుచూపులు

కొండ దిగువనా అదే పరిస్థితి: దేవస్ధానం టోల్‌ గేటు కానరాని జనసంచారం

Advertisement
 
Advertisement
Advertisement