సస్పెండ్‌ చేసిన కండువా | - | Sakshi
Sakshi News home page

సస్పెండ్‌ చేసిన కండువా

Jun 6 2026 12:23 AM | Updated on Jun 6 2026 12:23 AM

అన్నవరం: ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అంటూ ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్‌ చాలా పాపులర్‌. ఇప్పుడు రత్నగిరిపై ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఆ ఏవుందిలే.. మామూలు కండువాయే కదా అని అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదు. ఇప్పుడా కండువాయే వారిపై సస్పెన్షన్‌ వేటు వేయించింది.

ఈ సంఘటన వివరాలివీ.. రత్నగిరిపై సత్యదేవుని నిత్య కల్యాణం, రూ.2 వేలు, రూ.1,500 టిక్కెట్లతో వ్రతాలాచరించే భక్తులకు చాలా సంవత్సరాలుగా అంచు మీద జరీతో స్వామివారి నామం ముద్రించిన కండువాలను అందించేవారు. అయితే, కండువాల సరఫరా టెండర్‌ దక్కించుకున్న కొత్త టెండర్‌దారు రెండు వారాలుగా స్వామివారి నామం ఉన్న కండువాలు సరఫరా చేయడం లేదు. దీంతో, దేవస్థానం అధికారులు రోజుకో డిజైన్‌, రంగు కలిగిన కండువాలు ఇవ్వడంపై భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దీనిపై ‘నీ నామమెంతో రుచిరా!’ శీర్షికన ‘సాక్షి’ గురువారం కథనం ప్రచురించింది. ఈ కథనానికి అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. వెంటనే సత్యదేవుని నామం ముద్రించిన కండువాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆ మేరకు టెండర్‌దారుపై అధికారులు ఒత్తిడి తేవడంతో గురువారం 900 కండువాలు పంపించాడు. వీటిని గురు, శుక్రవారాల్లో భక్తులకు అందజేశారు. అయితే, ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించారన్న అభియోగంపై సెంట్రల్‌ స్టోర్స్‌ విభాగం సూపరింటెండెంట్‌ తాడి గుర్రాజును ఆ విభాగం నుంచి గోశాల, గార్డెన్‌కు బదిలీ చేశారు. అలాగే, జూనియర్‌ అసిస్టెంట్‌ కె.రమణబాబును సత్యగిరి సత్రాల శానిటరీ సూపర్‌వైజర్‌గా బదిలీ చేశారు. తాజాగా వారిద్దరినీ సస్పెండ్‌ చేస్తూ ఈఓ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

·˘ Æý‡™èl²WÇOò³ çÜ*ç³Ç…sñæ…yðl…sŒæ,

గుమాస్తాలపై వేటు

·˘ ÐéÆý‡… ÆøkÌZÏ

సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం

Advertisement
 
Advertisement
Advertisement