పిఠాపురం: దేశంలోని పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం కుంతీమాధవ స్వామి సాక్షిగా జనసేన నేతలు తీవ్ర అపచారానికి ఒడిగట్టారు. కుంతీమాధవస్వామి వారి కోనేరు అభివృద్ధి పనులకు జనసేన నేతలు శుక్రవారం సాయంత్రం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కుంతీమాధవ స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి వారిని మేళతాళాలతో ఊరేగింపుగా కోనేరు వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన నేతలు స్వామి వారి ఊరేగింపును వదిలేసి, జనసేన నేత, కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మేళం రామకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలు అక్కడ ఉండగానే.. పవిత్రమైన కోనేటి ప్రాంగణంలో కేకులు కట్ చేసి, కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఈ పుట్టిన రోజు వేడుకలను జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు దగ్గరుండి మరీ నిర్వహించడం గమనార్హం. సనాతన ధర్మం అంటూ నిత్యం ప్రసంగాలు దంచే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో.. అదే పార్టీకి చెందిన నాయకులు ఆ సనాతన ధర్మాన్ని కోనేటిలో కలిపేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫ కుంతీమాధవ స్వామి
ఊరేగింపులో అపచారం
ఫ పవిత్ర కోనేరులో
జనసేన నేత పుట్టిన రోజు వేడుకలు
ఫ దేవుని ఊరేగింపు వదిలేసి..
కేక్ కట్ చేసి, కొవ్వొత్తులు
వెలిగించి సంబరాలు


