పుణ్యక్షేత్రాల్లో పట్నా హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాల్లో పట్నా హైకోర్టు న్యాయమూర్తి

Jun 6 2026 12:23 AM | Updated on Jun 6 2026 12:23 AM

అన్నవరం/సామర్లకోట: బిహార్‌ రాజధాని పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం అన్నవరం, సామర్లకోట ఆలయాలను సందర్శించారు. అన్నవరంలో సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. పండితులు వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదాలను ఏఈఓ ఎల్‌.శ్రీనివాసరావు అందజేశారు. సామర్లకోటలోని పంచారామ క్షేత్రమైన శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని కూడా జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి, పూజలు చేశారు. కాలభైరవ స్వామి, ధ్వజస్తంభం, పెద్ద నంది, ఉపాలయాలు, మూలవిరాట్టును, అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ పండితులు ఆశీర్వచనాలు.. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఈఓ బళ్ల నీలకంఠం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement