అనపర్తి: చోరీ కేసులో సుమారు రూ.58 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు రాజమహేంద్రవరం ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి విద్య తెలిపారు. అనపర్తి పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మార్చి 31న అనపర్తి మండలం లక్ష్మీనరసాపురం గ్రామంలో జరిగిన చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజమహేంద్రవరం క్రైం బృందంతో కలసి దర్యాప్తు చేశారన్నారు. పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గొంటువానిపాలెంకు చెందిన శిరపనశెట్టి సన్యాసిరావు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో మండలంలోని కొప్పవరం వంతెన వద్ద అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడన్నారు. అనపర్తిలోనే కాకుండా ఆలమూరులోను, రావులపాలెంలో రెండు చోట్ల, నర్శీపట్నం, కోరుకొండలలోను చోరీలకు పాల్పడినట్టు ఆమె తెలిపారు. మొత్తం ఆరు చోరీలలోను సుమారు రూ.58 లక్షల విలువైన 385 గ్రాముల బంగారు వస్తువులు, 110 గ్రాముల వెండి వస్తువులు, రూ.5వేల నగదు స్వాధీనం చేసినట్టు డీఎస్పీ విద్య తెలిపారు. రాజమహేంద్రవరం క్రైమ్‌బ్రాంచ్ డీఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో కేసును త్వరితగతిన చేధించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన రాజమహేంద్రవరం క్రైమ్‌బ్రాంచ్ హెచ్‌సీ ప్రసాద్ రమణ సురేష్, విజయ్ అనపర్తికి చెందిన తమ్మారావు, రాజేష్, క్రైమ్ బ్రాంచ్ సీఐలు రాంబాబు, బాలాచారి, అనపర్తి సీఐ వీఎల్‌వీకే సుమంత్, ఎస్సై ఎల్ శ్రీనునాయక్‌లను డీఎస్పీ విద్య అభినందించారు.


