సిలబస్‌ భారం | - | Sakshi
Sakshi News home page

సిలబస్‌ భారం

Jun 5 2026 12:30 AM | Updated on Jun 5 2026 12:30 AM

సిలబస్‌ భారం వల్ల విద్యార్థులకు సమగ్ర అవగాహన కలగడం లేదు. ఉపాధ్యాయుల బోధనలో కూడా నాణ్యత లోపిస్తుంది. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో సిలబస్‌ మొత్తాన్ని రివిజన్‌ చేయడం విద్యార్థులకు కష్టంగా ఉంటోంది. సాంఘిక శాస్త్ర సిలబస్‌ను హేతుబద్ధీకరించాలి.

– కేఎస్‌వీ కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్‌ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం, రావులపాలెం

పని భారం

సాంఘిక శాస్త్రంలో సిలబస్‌ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మారిన నూతన పాఠ్య పుస్తకాలలో మరింత పెరిగింది. ఇది ఉపాధ్యాయుల పనిభారాన్ని విపరీతంగా పెంచుతోంది. విద్యార్థులకు కూడా ఇబ్బందికరమే. కాబట్టి సిలబస్‌ను తగ్గించాలి.

– కుడుపూడి మురళీధర్‌, సోషల్‌ టీచర్‌, పుల్లేటికుర్రు జెడ్పీ ఉన్నత పాఠశాల

పాఠాలు ఎక్కువ

పదో తరగతిలో సైన్స్‌కు 13 పాఠాలు ఉండగా, సాంఘిక శాస్త్రంలో 22 పాఠాలు ఉండటం, అలాగే ఆరు నుంచి 9 తరగతుల్లోనూ అధిక పాఠ్య భారం కొనసాగడం ఆందోళనకరం. సమాజం, రాజ్యాంగం, చరిత్ర, పౌర బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో సిలబస్‌ రూపొందించాలి.

– కేవీ శేఖర్‌, ప్రధాన సంపాదకులు, రాష్ట్ర ఎస్‌టీయూ ఉపాధ్యాయవాణి, రావులపాలెం

Advertisement
 
Advertisement
Advertisement