రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరుకు చెందిన యువకుడు పుప్పాల చేతన్‌షణ్ముఖనాయుడు ఒడిశాలో గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల మూడవ తేదీ వరకు జరిగిన జూనియర్ నేషనల్ కిక్‌బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో అండర్–17 విభాగంలో ద్వితీయస్థానం సాధించి రజత పతకం సాధించాడు. ఈ మేరకు ఏపీ స్టేట్ కిక్‌బాక్సింగ్ ప్రెసిడెంట్ జి.ఆనందబాలు ఓ ప్రకటనలో తెలిపారు. రజత పతకం సాధించిన షణ్ముఖనాయుడుని జిల్లా కిక్‌బాక్సింగ్ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్రకార్యదర్శి గొందేశి శ్రీనివాసులరెడ్డి, ప్రెసిడెంట్ ఎం.గణేష్, సెక్రటరీ ఎన్.గిరివెంకటరమణ, కోశాధికారి ఎం.భవానిశంకర్, సంయుక్త కార్యదర్శి అపర్ణనాగప్రియ అభినందించారు.


