విద్యార్థుల స్థాయికి మించి.. | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల స్థాయికి మించి..

Jun 5 2026 12:30 AM | Updated on Jun 5 2026 12:30 AM

సోషల్‌ స్టడీస్‌లో సిలబస్‌ విద్యార్థుల స్థాయికి మించి ఉంది. పాఠాల సంఖ్య కూడా మిగతా సబ్జెక్టులతో పోల్చిస్తే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని తగ్గించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయాలి. విద్యార్థులపై సిలబస్‌ భారం మోపడం సరైన పద్ధతికాదు.

– ఎస్‌.జ్యోతిబసు,

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, రావులపాలెం

ఇబ్బందికరం

ఆరు నుంచి పది తరగతులకు సోషల్‌ సిలబస్‌ బోధన, అభ్యసన అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది. దీని నుంచి తప్పనిసరిగా కొన్ని పాఠ్యాంశాలను తొలగించాలి. సోషల్‌లో ఉండే నాలుగు అంశాలకు సంబంధించి ప్రతి రెండు అంశాలకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి.

– దీపాటి సురేష్‌ బాబు, పీఆర్‌టీయూ జిల్లా

అధ్యక్షుడు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement