లో
చంద్రబాబుకు
గుణపాఠం తప్పదు
ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించి, మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. రౌతులపూడిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఏలేశ్వరం పట్టణం బాలాజీ చౌక్ వద్ద, ఏలేశ్వరం రూరల్ సి.రాయవరం, శంఖవరం మండలం కత్తిపూడి, ప్రత్తిపాడుల్లో కూడా పార్టీ శ్రేణులు కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి, నిరసన తెలిపాయి. ఆయా కార్యక్రమాల్లో గొల్లు చినదివాణం, బెహరా రాజేశ్వరి, సామంతుల సూర్యకుమారి, సుంకర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నిరంకుశ పాలన నశించాలి
వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన పెద్దాపురం, సామర్లకోటల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ పత్రాలు, ఆ హామీలపై పచ్చ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు, బాండ్ల ప్రతులను దహనం చేశారు. పెద్దాపురం దర్గా సెంటర్‌లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్ ఆధ్వర్యాన జరిగిన నిరసన ప్రదర్శన, ధర్నాలో దొరబాబు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామర్లకోట గడియారం స్తంభం సెంటర్ నుంచి రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్ వరకూ మండుటెండలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, కూటమి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వ నిరంకుశ పాలన నశించాలి, సీఎం డౌన్‌డౌన్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్ కూడలిలో జన సందోహం నడుమ చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతకాలతో ఉన్న బాండ్లు, ఎల్లో మీడియాలో ఇచ్చిన ప్రకటనల ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు వీరబాబు, అధికార ప్రతినిధి ఇనకొండ విష్ణుచక్రం, మహిళా ఉపాధ్యక్షురాలు ఏలేటి అనంతలక్ష్మీ చౌదరి, కార్యదర్శులు ఊబా జాన్‌మోజెస్, గోపు మురళి తదితరులు పాల్గొన్నారు.
8


