వెన్నుపోటు చంద్రబాబు నైజం | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు చంద్రబాబు నైజం

Jun 5 2026 12:30 AM | Updated on Jun 5 2026 12:30 AM

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ దగ్గర నుంచి రాష్ట్రంలోని సాధారణ ప్రజల వరకూ వెన్నుపోటు పొడవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటు. నిత్యం ప్రజలను మోసం చేస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారు. అబద్ధపు హామీలిచ్చి, ప్రజలను వంచించి, అధికారాన్ని చేజిక్కించుకుని, జీవితం సాగిస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదు.

– వాసిరెడ్డి జమీలు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, రౌతులపూడి

నిరుద్యోగ భృతి పేరుతో మోసం

యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని, అప్పటి వరకూ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీంతో కూటమికి ఓట్లు వేశాం. అయితే, రెండేళ్లు గడచినా ఇప్పటి వరకూ ఉద్యోగాల్లేవు సరికదా.. నిరుద్యోగ భృతిపై ఆలోచించిన దాఖలాలే లేవు. రెండేళ్లకు రూ.72 వేల నిరుద్యోగ భృతి రావాల్సి ఉంది.

– ఉప్పెటి ప్రసాద్‌, నిరుద్యోగి, పెద్దాపురం

Advertisement
 
Advertisement
Advertisement