మండల కేంద్రాల్లో నేడు వైఎస్సార్‌ సీపీ నిరసన | - | Sakshi
Sakshi News home page

మండల కేంద్రాల్లో నేడు వైఎస్సార్‌ సీపీ నిరసన

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

తుని: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా గురువారం మండల కేంద్రాల్లో సూపర్‌ సిక్స్‌ ప్రతులను దగ్ధం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా బుధవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. తుని నియోజకవర్గానికి సంబంధించి కోటనందూరు, తొండంగి మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని, తుని మండలం, పట్టణానికి సంబంధించి తుని మండలం ఎస్‌.అన్నవరం పార్టీ కార్యాలయం వద్ద ఆ ప్రతులను దగ్ధం చేయనున్నట్టు తెలిపారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి

Advertisement
 
Advertisement
Advertisement