తుని: ఏపీ పీజీ సెట్‌లో శ్రీ ప్రకాష్ విద్యా ర్థులు ఉత్తమ ప్రతిభ చూపా రని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రామకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కెమిస్ట్రీ విభా గంలో ఈ.వాసు 8, ఎన్.నాగేశ్వరి 45, పి.మైథిలి 99, లైఫ్ సైన్స్‌లో కె.స్నేహ 48, ఫిజిక్స్‌లో వై.దీప్తి 69, జువాలజీలో వై.పావని 94, ఎస్.లోకేశ్వరి 98వ ర్యాంకులు సాధించారన్నారు. కళాశాలలో డిగ్రీతో పాటు పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ ద్వారా ఈ విజయాన్ని సాధించారని రామకృష్ణారెడ్డి కొనియాడారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ప్రకాష్ అభినందించారు.


