● వడగళ్ల సందళ్లు | - | Sakshi
Sakshi News home page

● వడగళ్ల సందళ్లు

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

కొన్ని రోజులుగా సూర్యుడి సెగభగలతో అల్లాడుతున్న ప్రజలు శుక్రవారం ఉదయం కురిసిన వడగళ్ల వానతో ఉపశమనం పొందారు. సామర్లకోట పట్టణంతో పాటు కరప గ్రామంలో ఉదయం ఆకాశాన దట్టమైన మబ్బులు కమ్ముకుని ఈదురు గాలులు, ఉరుములతో ఒక్కసారిగా వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సేద తీరుతున్నారు. అదే సమయంలో రేకుల షెడ్లు, పెంకుటిళ్లపై రాళ్లు పడుతున్న శబ్దాలు రావడంతో ఏం జరిగిందోనని పలువురు బయటకు వచ్చారు. వర్షంతో పాటు వడగళ్లు పడుతూండటంతో పలువురు ముఖ్యంగా చిన్న పిల్లలు వాటిని సేకరిస్తూ.. ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. వడగళ్లు చిన్న సైజు ముత్యాల్లా పడుతూండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. కరపలో చాలా ఎక్కువగా వడగళ్లు పడ్డాయి. ఇన్ని వడగళ్లు ఎప్పుడూ చూడలేదంటూ ప్రజలు వాటిని ఏరుకుంటూ కనిపించారు.

– సామర్లకోట/కరప

Advertisement
 
Advertisement
Advertisement